సాయితేజ్.. దెయ్యం -థ్రిల్లర్

ప్రతి రోజూ పండగే సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్ తో వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు హీరో సాయి ధరమ్. కొత్త దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో ఇప్పటికే సోలో బతుకే సో బెటరు…

ప్రతి రోజూ పండగే సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్ తో వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు హీరో సాయి ధరమ్. కొత్త దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో ఇప్పటికే సోలో బతుకే సో బెటరు విడుదలకు రెడీగా వుంది. దీని తరువాత దేవాకట్టా డైరక్షన్ లో ఓ సినిమా ఓకె చేసారు. భగవాన్ పుల్లారావు నిర్మాతలు. ఈ సినిమా తరువాత సోలో బతుకే సో బెటరు నిర్మాతలకే మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది., ఈ సినిమా ప్రకటన రేపు రాబోతున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ శిష్యుడు ఒకరు చెప్పిన దెయ్యం-థ్రిల్లర కథను సాయితేజ్ ఎప్పుడో ఓకె చేసి పెట్టారు. ఇప్పుడు ఈ సినిమానే చేయబోతున్నారా? మరోటా? అన్నది తెలియాల్సి వుంది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో నిర్మిస్తారు. మొత్తానికి ఈ లెక్కన 2021 చివరకు వరకు సాయి తేజ్ సినిమాలు లైన్ లో రెడీగా వుంచినట్లు అవుతోంది. మరోక్క సినిమా ఏదయినా ఓకే చేసుకుంటే చాలు 2022 వరకు ఇక డైరీ ఖాళీ వుండదు.

టిడిపిని ద్వంసం చేసి, ఆ పునాదులపై ఎదగాలని

సినిమా ప్లాప్ అయితే అంతే