బాబుకు ప్రతి గంటకు డ్రై ఫ్రూట్స్.. అందుకే తెర!

చంద్రబాబుకు ఏపీ మంత్రులు చాలామంది విమర్శిస్తుంటారు. అందులో కొడాలి నాని విమర్శలు ప్రత్యేకం. అయితే ఎంతమంది చంద్రబాబును విమర్శించినా, లక్ష్మీపార్వతి స్టయిల్ మాత్రం వేరు. అల్లుడు..అల్లుడు అంటూ ఆమె చేసే విమర్శలు ఆమెకే ప్రత్యేకం.…

చంద్రబాబుకు ఏపీ మంత్రులు చాలామంది విమర్శిస్తుంటారు. అందులో కొడాలి నాని విమర్శలు ప్రత్యేకం. అయితే ఎంతమంది చంద్రబాబును విమర్శించినా, లక్ష్మీపార్వతి స్టయిల్ మాత్రం వేరు. అల్లుడు..అల్లుడు అంటూ ఆమె చేసే విమర్శలు ఆమెకే ప్రత్యేకం. తన అల్లుడి వరసైన చంద్రబాబుపై మరోసారి సెటైర్లు వేశారు లక్ష్మీపార్వతి.

“లోపల మా అల్లుడు నిండా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. పక్కన ఎవ్వరూ లేకుండా మధ్యలో తెర అడ్డం పెట్టారు. మా అల్లుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి ఏర్పాట్లు బాగా చేశారు. మా అల్లుడు గంటకోసారి డ్రై ఫ్రూట్స్ తినాలి. లేకపోతే అతని ఆరోగ్యం బాగోదు. అల్లుడి బాగోగులు అత్తకే తెలుస్తాయి కదా. మా అల్లుడి బాగోతం నాకే తెలుసు.”

జనాగ్రహ దీక్షలో పాల్గొన్న లక్ష్మీపార్వతి, ఇలా చంద్రబాబుపై సెటైర్లు వేశారు. పాతికేళ్లుగా తన అల్లుడ్ని చూస్తున్నానని.. చంద్రబాబు ఫీట్లు, పాట్లు, అవస్థలు, అపసోపాలు, ఆలోచనలు అన్నీ తనకు తెలుసన్నారు లక్ష్మీపార్వతి. అబద్ధం అల్లుడితో పుట్టిందని, తన అల్లుడితోనే అది పోతుందన్నారు.

“అమరావతి ప్రాణం అంటాడు మా అల్లుడు. ఇల్లు మాత్రం అక్కడ కట్టుకోడు. ప్రజల కోసం పోరాటం అంటాడు. ప్రజలు కరోనా కష్టాల్లో ఉంటే, హైదరాబాద్ వెళ్లి దాక్కుంటాడు. ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు చేస్తే, కోర్టుకెళ్లి స్టేలు తెస్తాడు మా అల్లుడు. బాగా ఉన్న చోటును పాడుచేయడమే మా అల్లుడి పని. ఆయన జీవితమే అబద్ధాలు. అబద్ధం అతడితో పుట్టిందా లేక అబద్ధం కంటే ముందే బాబు పుట్టాడో తెలియడం లేదు. అతడితో పాటే అబద్ధం పుట్టి, పెరిగి, అతడితోనే పోతుంది.”

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవరని అన్నారు లక్ష్మీపార్వతి. అసమర్థుడైన లోకేష్ కు చంద్రబాబు అవినీతిని నేర్పించాడని, ఇప్పుడు కొత్త కొత్త తిట్లు నేర్పించారని విమర్శించారు.