వి అనే సినిమాను మాంచి ఆసక్తితో, మాంచి టెక్నాలజీ వాడి తయారుచేసారు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. ముఖ్యంగా సౌండ్ క్వాలిటీ విషయంలో చాలా కేర్ తీసుకుని, ముంబాయి టీమ్ ను వాడి తను అనుకున్న ఎఫెక్ట్ రాబట్టారు. సినిమాకు నిర్మాత కూడా భారీగా ఖర్చు చేసారు. దాదాపు 35 కోట్లకు పైగా ఖర్చయిందని బోగట్టా. ఎందుకంటే నాని, సుధీర్ బాబు లాంటి స్టార్ కాస్ట్ వుంది. బలమైన టెక్నికల్ టీమ్ వుంది.
అందువల్ల ఈ సినిమాను థియేటర్లో మాత్రమే విడుదలచేయాలన్నది డైరక్టర్ ఇంద్రగంటి ఆలోచన. గతంలో గ్రేట్ ఆంధ్రకు ఇంటర్వ్యూ ఇచ్చినపుడు కూడా ఇదే చెప్పారు. ' నా సినిమా మొబైల్ లో చూడడానికి కాదు, థియేటర్లో చూడడానికి' అని. కానీ ఇప్పుడు ఆ ఆశ అడియాస అయిపోతోంది. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియక, తీరా థియేటర్లు ప్రారంభమైనా, ఆడియన్స్ రెస్సాన్స్ ఎలా వుంటుందో తెలియక, ఇక ఓటిటికి ఇచ్చేయాలని డిసైడ్ అయినట్లు బోగట్టా.
నిర్మాత దిల్ రాజు ఇలా చేయడం వల్ల ఇటు దర్శకుడు ఇంద్రగంటికే షాక్ కాదు, ధియేటర్ల వ్యవస్థకు కూడా షాక్ నే. ఒటిటి వల్ల థియేటర్ల వ్యవస్థ నష్టపోతుందని ఎగ్జిబిటర్లు అంతా ఆందోళన చెందుతున్న టైమ్ లో దిల్ రాజు ఇలా చేయడం అంటే ఆ వర్గానికి షాక్ ఇచ్చినట్లే…గిల్డ్ నాయకుడు, పెద్ద ఎగ్జిబిటర్ అయిన దిల్ రాజు నే ఇలా చేయడం, పైగా దిల్ రాజుకు ఓ ఓటిటి సంస్థలో మైనర్ షేర్ వుందని వార్తలు రావడం అంటే ఎగ్జిబిటర్లకు కాస్త గట్టి షాక్ నే.