ఏపీ పోలీసులే టార్గెట్… ?

ఈ రోజు పోలీస్ అమర వీరుల దినోత్సవం. ఈ రోజున వారు చేసిన సేవలను అంతా మెచ్చుకుంటారు. అమరులకు నివాళి అర్పిస్తారు. నిజానికి పోలీసులు నిరంతర సేవకులు. వారి లేని నిముషాన్ని కూడా సమాజం…

ఈ రోజు పోలీస్ అమర వీరుల దినోత్సవం. ఈ రోజున వారు చేసిన సేవలను అంతా మెచ్చుకుంటారు. అమరులకు నివాళి అర్పిస్తారు. నిజానికి పోలీసులు నిరంతర సేవకులు. వారి లేని నిముషాన్ని కూడా సమాజం అసలు ఊహించుకోలేదు.

అటువంటి పోలీసుల సంస్మరణ దినోత్సవం వేళ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం వారిపైనే హాట్ హాట్ గా విమర్శలు చేస్తోంది. నిప్పులే చెరుగుతోంది. పోలీసులకు కూడా పార్టీల రంగులు అంటకట్టి టార్గెట్ చేస్తున్నారు తమ్ముళ్ళు.

డీజీపీ మీద చంద్రబాబు ఘాటు విమర్శలు చేస్తే అదే పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆ జిల్లా పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు తాజాగా లేఖ రాశారు. 

తాను శాంతియుతంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూంటే తనను చేయి పట్టి పోలీసులు లాగారని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. తన విషయంలో పోలీసులు పూర్తిగా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు కాబట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరి దీని మీద ఓం బిర్లా ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిందే.