ప్రతిరోజూ పండగే లాంటి సూపర్ హిట్ తరువాత హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా సోలో బతుకే సో బెటరూ….కొత్త దర్శకుడు సుబ్బు అందిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఓ పది రోజుల పని తప్ప, అంతా పూర్తయిపోయింది. కరోనా సమస్య లేకుంటే ఎప్పుడో విడుదలైపోయేది. ఇలాంటినేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా ఓటిటి దారిలోకి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జీ టీవీతో ఈ సినిమాకు శాటిలైట్ టై అప్ వుంది. అదే ఛానెల్ లో వరల్డ్ నెగిటివ్ రైట్స్ బేరసారాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. మొత్తం 31 కోట్ల రేంజ్ డీల్ ఏదో నడుస్తోందని, ఇదే సినిమాతో పాటు, నిత్యామీనన్ కీలకపాత్రలో ఇదే నిర్మాతలు లండన్ నేపథ్యంలో నిర్మించిన ఓ చిన్న సినిమాకు కూడా ప్యాకేజ్ గా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే డీల్ ఆల్ మోస్ట్ ఫైనల్ నే కానీ, వర్క్ ఫినిష్ అయితేనే ఓటిటి లో అయినా థియేటర్ లో అయినా విడుదలయ్యేది. కరోనా ముగియాలి. వ్యాక్సీన్ రావాలి. అందుకోసమే అన్ని సినిమాల మాదిరిగా ఈ సినిమా కూడా వెయిటింగ్.