సినిమా వాళ్లు.. సెక్స్ వ‌ర్సెస్ మ‌నీ.. !

త‌న‌ను సెక్సువ‌ల్ గా వేధించార‌ని న‌టీమ‌ణులు ఫిర్యాదులు చేయ‌డం లేదా కోర్టుల్లో పిటిష‌న్లు వేయ‌డం, ఆ ఫిర్యాదుల‌ను ఎదుర్కొన‌డానికి, ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న వారు సింపుల్ గా ప‌రువు న‌ష్టం దావాలు వేయ‌డం! ఇదే కొన‌సాగుతూ…

త‌న‌ను సెక్సువ‌ల్ గా వేధించార‌ని న‌టీమ‌ణులు ఫిర్యాదులు చేయ‌డం లేదా కోర్టుల్లో పిటిష‌న్లు వేయ‌డం, ఆ ఫిర్యాదుల‌ను ఎదుర్కొన‌డానికి, ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న వారు సింపుల్ గా ప‌రువు న‌ష్టం దావాలు వేయ‌డం! ఇదే కొన‌సాగుతూ ఉంది. 

ఇండియాలో మీ టూ ఉద్య‌మం ఊపందుకున్న ద‌గ్గ‌ర నుంచి ఇదే క‌థ‌. తాము సెల‌బ్రిటీలు అయిన వ్య‌క్తుల నుంచి లైంగిక వేధింపుల‌ను ఎదుర్కొన్న‌ట్టుగా ప‌లువురు హీరోయిన్లు అప్ప‌ట్లో హ‌ల్చ‌ల్ చేశారు. పాత వ్య‌వ‌హారాల గురించి పోలీసుల‌కు ఫిర్యాదులు, కోర్టుల్లో పిటిష‌న్లు ప‌డ్డాయి. ఈ విష‌యంలో త‌నుశ్రీ ద‌త్తా నుంచి, యాక్ష‌న్ కింగ్ అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు చేసిన న‌టి వ‌ర‌కూ చాలా మంది వార్త‌ల్లోకి వ‌చ్చారు. 

విశేషం ఏమిటంటే.. వారి చేత ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్న మేల్ సెల‌బ్రిటీలంతా ఒకే ర‌కంగా స్పందించారు. వారు త‌మ‌పై అనుచిత ఆరోప‌ణ‌లు చేశార‌ని, వారి వ‌ల్ల త‌మ ప‌రువుకు భంగం క‌లిగింద‌ని.. అంటూ కోట్ల రూపాయ‌ల మొత్తానికి ప‌రువు న‌ష్టం దావాలు వేశారు!

ఈ విష‌యంలో అలోక్ సింగ్ నుంచి అర్జున్ వ‌ర‌కూ అంతా ప‌రువు న‌ష్టం దావాల‌నే న‌మ్ముకున్నారు. మ‌ళ్లీ ఆ దావాల సంగ‌తేమ‌య్యిందో ఎవ‌రికీ అంత తేలిక‌గా తెలియ‌దు. ఇలా సెక్స్ వ‌ల్ హెరాస్ మెంట్ వ‌ర్సెస్ డిఫ‌మేష‌న్ సూట్స్ ప‌రంప‌ర కొన‌సాగుతూ ఉంది.

తాజాగా న‌టి షెర్లిన్ చోప్రాపై శిల్పా షెట్టి దంప‌తులు భారీ స్థాయి ప‌రువు న‌ష్టం దావాను వేశారు. త‌మ ప‌రువుకు 50 కోట్ల రూపాయ‌ల విలువ గ‌ట్టి.. ఆ మేర‌కు త‌మ ప‌రువుకు షెర్లిన్ భంగం క‌లిగించింద‌ని, ఆ మొత్తాన్ని ఆమె త‌మ‌కు చెల్లించాల‌ని వారు కోర్టులో పిటిష‌న్ వేశారు. 

రాజ్ కుంద్రా పోర్న్ కుంభ‌కోణంలో చిక్కుకున్నాకా.. చాలా ర‌చ్చే జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌మ‌పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఎదుర్కొన‌డానికి శిల్పా షెట్టి చ‌ట్ట‌ప‌ర‌మైన పిటిష‌న్ల‌ను వేస్తోంది. ఇది వ‌ర‌కూ మీడియా మీద కూడా ఒక పిటిష‌న్  దాఖ‌లు చేసింది. అయితే అది కోర్టు తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది.

ఇక పోర్న్ వ్య‌వ‌హారంలో షెర్లిన్ చోప్రాను ముంబై పోలీసులు విచారించారు. ఆ త‌ర్వాత ఆమె రాజ్ కుంద్రాపై వ‌ర‌స ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చింది. త‌ను బాధితురాలిని అంటోంది. ఇక పోర్న్ వ్య‌వ‌హారంలో ఆమె రాజ్ కుంద్రా పైనే కాకుండా శిల్పా షెట్టి పై కూడా ఆమె కంప్లైంట్ ఇచ్చింది. 

ముంబై పోలీసులు కూడా ఆ వ్య‌వ‌హారంలో రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు కానీ, శిల్ప పై ఎలాంటి అభియోగాలు మోప‌లేదు! కానీ షెర్లిన్ మాత్రం శిల్ప పేరును మెన్ష‌న్ చేస్తోంది. ఈ క్ర‌మంలో ఆమెపై రాజ్ కుంద్రా, శిల్ప‌లు జాయింటుగా పెద్ద ప‌రువు న‌ష్టం దావానే వేశారు. మ‌రి ఈ వ్య‌వ‌హారంలో ఎవ‌రు గెలుస్తారో!