సునీల్ లైఫ్ స్టయిల్ మార్చుకోవాలి

వందల కోట్ల టర్నోవర్ వున్న సామ్రాజ్యానికి అధిపతి ఆసియన్ సునీల్. వందకు పైగా థియేటర్లు, ఎ ఎమ్ బి మాల్, బెంగళూరులో, హైదరాబాద్ లో, విశాఖ లో మల్టీఫ్లెక్స్ ల ప్లానింగ్.. సినిమా నిర్మాణాలు,…

వందల కోట్ల టర్నోవర్ వున్న సామ్రాజ్యానికి అధిపతి ఆసియన్ సునీల్. వందకు పైగా థియేటర్లు, ఎ ఎమ్ బి మాల్, బెంగళూరులో, హైదరాబాద్ లో, విశాఖ లో మల్టీఫ్లెక్స్ ల ప్లానింగ్.. సినిమా నిర్మాణాలు, డిస్ట్రిబ్యూషన్లు ఇలా ఒకటి కాదు రెండు కాదు సవాలక్ష యావిగేషన్లు. మామూలుగానే టెన్షన్లు బోలెడు దానికి తోడు, లాక్ డౌన్…ఇవి చాలవా టెన్షన్లు పెంచడానికి.

కానీ వీటికి తోడు ఆసియన్ సునీల్ తన ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ద పెట్టరని ఆయన సన్నిహితుల బోగట్టా. సాధారణంగా సినిమా జనాలు కాస్త గట్టిగానే వాకింగ్, వ్యాయాపం, యోగా వంటివి చేస్తారు. ఈ విషయంలో సునీల్ కు కాస్త శ్రద్ధ తక్కువ. పైగా ఆయన భోజన ప్రియుడు. చైనీస్, నాన్ వెజ్ అంటే కాస్త ప్రేమ. పైగా చాలా మంది సినిమా జనాల మాదిరిగా అప్పుడప్పుడు డ్రింక్ అన్నది కామన్. వీటన్నింటి ఫలితంగా కాస్త భారీ శరీరం.

అందువల్ల వయసు మరీ ఎక్కువ కాకపోయినా, ఆసియన్ సునీల్ కు ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వల్ల ఇప్పుడు హార్ట్ సమస్య వచ్చి, స్టంట్ వేయాల్సి వచ్చింది. ఈ రోజుల్లో స్టంట్ అన్నది జస్ట్ కామన్ థింగ్. కానీ ఇంత సామ్రాజ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత తనపై వున్నందును ఆసియన్ సునీల్ ఇకనైనా తన లైఫ్ స్టయిల్ మార్చుకోవాలి.

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?