ఏపీలో షూటింగులు చేయాల్సిందే…?

ఏ విధంగా చూసినా టాలీవుడ్ కి ఏపీ హబ్ అన్నది అంతా చెబుతారు. ఏపీలో ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. అటు విశాఖ నుంచి రాజమండ్రి దాకా హృద్యమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అలాగే…

ఏ విధంగా చూసినా టాలీవుడ్ కి ఏపీ హబ్ అన్నది అంతా చెబుతారు. ఏపీలో ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. అటు విశాఖ నుంచి రాజమండ్రి దాకా హృద్యమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అలాగే క్రిష్ణా నదీ పరివాహిక ప్రాంతం కూడా అద్భుతమైన షూటింగ్ స్పాట్ గా ఉంటుంది.

ఇక ఏపీలో షూటిగుల సందడి 80 దశకంలో ఊపందుకుంది. దిగ్దర్శకుడు కె బాలచందర్ దీనికి శ్రీకారం చుడితే దాసరి, విశ్వనాధ్, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ వంటి వారు తరువాత రోజులలో అందుకున్నారు. 

మొత్తానికి ఆంధ్రా లో షూటింగులు లేకుండా ఒకపుడు తెలుగు సినిమా తయారయ్యేది కాదు. అయితే గత కొంతకాలంగా మాత్రం మార్పులు వచ్చాయి. దాంతో తెలుగు సినిమా షూటింగులు అంటే విదేశాలకే పరిమితం అవుతున్నారు. మరికొంతమంది ఇతర రాష్ట్రాలలో చేస్తున్నారు.

దీని మీద ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కొన్ని కీలకమైన వ్యాఖ్యలే చేశారు. తాజాగా విశాఖలో జరిగిన ఒక సినిమా ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ ఏపీలో సినిమా షూటింగులు చేయాలని నిర్మాతలకు పిలుపు ఇచ్చారు. కనీసం పాతిక శాతం సినిమా చిత్రీకరణ అయినా ఏపీలో జరగాలని ఆయన గట్టిగా కోరారు.

ఒక విధంగా మంత్రి గారి ప్రతిపాదన మంచిదే. ఎందుకంటే ఏపీలో షూటింగులు జరిగితే స్థానికంగా ఉపాధి ఎంతో కొంత లభిస్తుంది. అలాగే లోకల్ టాలెంట్ కి కూడా అవకాశం ఉంటుంది. ఏదో ఒకనాటికి టాలీవుడ్ కూడా ఏపీలో విస్తరించేందుకు వీలు కలుగుతుంది. మరి మంత్రి గారి మాటలు సినీ పెద్దలు ఆలకిస్తారా. లేకపోతే ప్రభుత్వం నుంచి తమకు వరాలు మాత్రమే కావాలని కోరుకుంటారా. చూడాలి మరి.