హుషారుకు పెట్టింది పేరు ఆర్జీవీ. కోవిడ్ ను కూడా కాదని చకచకా సినిమాలు చేసిన డైరక్టర్. ఆన్ లైన్ రిలీజ్ లు చేస్తూ, లాక్ డౌన్ టైమ్ లో కూడా బాగానే సంపాదించారు. పవర్ స్టార్ సినిమా ను లక్షల్లో చేసి, కోటి ముఫై లక్షల వరకు ఆదాయం సంపాదించారని టాక్. ఆలాంటి ఆర్జీవీ వున్నట్లుండి స్లో అయ్యారు. కారణం మరేం కాదు. వైరల్ ఫీవర్ సోకడమే.
వైరల్ ఫీవర్ అంటే కరోనా అని అనుకోవాల్సిన పనిలేదు. టెస్ట్ చేయించినా నెగిటివ్ నే వచ్చింది. జస్ట్ రెగ్యులర్ వైరల్ ఫీవర్ అని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ఫీవర్ తగ్గిగా విపరీతంగా వీక్ కావడంతో ఆర్జీవీ ప్రస్తుతం రెస్ట్ లో వున్నట్లు తెలుస్తోంది. ఆర్జీవీ పక్కన వుండే ఆయన బంధువు కూడా ఫీవర్ రావడంతో, టెస్ట్ చేయించారని, నెగిటివ్ అని తేలిందని తెలుస్తోంది.
అందువల్ల ప్రస్తుతానికి ఏటిటి సినిమాలను కాస్త పక్కన పెట్టి ఆర్జీవీ బృందం విశ్రాంతి తీసుకుంటోంది. కాస్త శక్తి పుంజుకున్నాక మళ్లీ ఆర్జీవీ తన మార్కు హడావుడితో రెడీ అంటారు.