విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం తెగ ఉవ్విళ్ళూరుతోంది. అదే సమయంలో ఉక్కుకు ఉన్న అన్ని హక్కుభుక్తాలు తమకు నచ్చిన వారికి కట్టబెట్టి స్టీల్ కాంతులు అసలు లేకుండా చేయాలని కేంద్రం చకచకా అడుగులు వేస్తోంది.
అదే కేంద్ర క్యాబినేట్ లో ఉన్న మంత్రి రామ్ దాస్ అథవాలే అయితే ఉక్కుని ప్రైవేట్ పరం చేయడం తప్పే అంటున్నారు. అంతే కాదు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవెట్ పరం చేస్తే ఎస్సీ ఎస్టీలకు రిజవేషన్లతో పాటు ఎన్నో అవకాశాలు పూర్తిగా పోతాయని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
అదే సమయంలో ఉపాధి అవకాశాలు కూడా బడుగులకు దక్కవని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే ఉక్కు ప్రైవేట్ పై దూకుడు కొందరు కేంద్ర మంత్రులకు అసలు సహించలేని విషయంగా ఉందని అర్ధమవుతోంది. అయితే రామ్ దాస్ అథవాలే దీని మీద మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో ఉక్కు వంటివి వెళ్లినా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూస్తామని హామీ మాత్రం ఇచ్చారు.
మొత్తానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ఇన్నాళ్ళూ విపక్షాల నుంచే కామెంట్స్ వచ్చాయి. మరి ఇపుడు కేంద్ర మంత్రి ఒకరు కూడా ఇది మంచి నిర్ణయం కాదు అంటున్నారంటే ఆలోచించుకోవాల్సిందేగా. కాగా తాజాగా విశాఖ టూర్ లో రామ్ దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు.