మరో అందాల సుందరికి కరోనా పాజిటివ్

మొన్నటికిమొన్న మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ కరోనా బారిన పడింది. ఆ తర్వాత దాన్నుంచి ఆమె విజయవంతంగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు మరో అందాల సుందరికి కరోనా సోకింది. మాజీ మిస్…

మొన్నటికిమొన్న మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్ కరోనా బారిన పడింది. ఆ తర్వాత దాన్నుంచి ఆమె విజయవంతంగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు మరో అందాల సుందరికి కరోనా సోకింది. మాజీ మిస్ ఇండియా వరల్డ్, ప్రస్తుత హీరోయిన్ నటాషా సూరికి కరోనా సోకింది.

“ఓ 6 రోజుల కిందట అర్జెంట్ పని మీద పుణె వెళ్లాను. అక్కడ్నుంచి ఇంటికొచ్చిన వెంటనే జ్వరం వచ్చింది. గొంతు నొప్పి, వీక్ నెస్ కూడా ఆవహించింది. అనుమానం వచ్చి 3 రోజుల కిందట టెస్ట్ చేయించుకున్నాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాను. నాకు ఇప్పటికీ జ్వరం, నీరసం ఉన్నాయి.”

ఇలా తనకు కరోనా సోకిన విషయాన్ని నటాషా సూరి ప్రకటించింది. ప్రస్తుతం తను తన అమ్మమ్మ, చెల్లెలితో కలిసి ఉంటోంది. కాబట్టి వాళ్లకు కూడా పరీక్షలు చేయించానని చెప్పుకొచ్చింది. వైద్యుల సలహా మేరకు మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లు తీసుకుంటోంది నటాషా.

తాజాగా 'డేంజరస్' అనే సినిమాలో నటించింది నటాషా. కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14న ఈ సినిమా ఎమ్మెక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. కరోనా సోకడంతో ఈ సినిమా ప్రమోషన్ కు నటాషా దూరమైంది.

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?