మిహీక‌ పెళ్లి డ్రెస్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌…ధ‌ర తెలిస్తే?

పెళ్లంటే మ‌హిళ‌లు ఆభ‌ర‌ణాలు, వ‌స్త్రాలపైనే ఎక్కువ దృష్టి పెడ‌తారు. త‌మ కోరిక‌ల‌న్నీ పెళ్లి సంద‌ర్భంలో తీర్చుకోవ‌డం చూస్తుం టాం. ప్ర‌తి ఒక్క ఆడ‌పిల్ల త‌మ‌త‌మ ఆర్థిక స్తోమ‌త‌ను బ‌ట్టి బంగారు ఆభ‌ర‌ణాలు, ప‌ట్టు చీర‌లు,…

పెళ్లంటే మ‌హిళ‌లు ఆభ‌ర‌ణాలు, వ‌స్త్రాలపైనే ఎక్కువ దృష్టి పెడ‌తారు. త‌మ కోరిక‌ల‌న్నీ పెళ్లి సంద‌ర్భంలో తీర్చుకోవ‌డం చూస్తుం టాం. ప్ర‌తి ఒక్క ఆడ‌పిల్ల త‌మ‌త‌మ ఆర్థిక స్తోమ‌త‌ను బ‌ట్టి బంగారు ఆభ‌ర‌ణాలు, ప‌ట్టు చీర‌లు, ఇత‌ర‌త్రా వ‌స్త్రాల‌ను కొనుగోలు చేస్తుంటుంది. అలాంటిది ద‌గ్గుబాటి గారింటికి కాబోయే కోడ‌లు గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది.

మిహీక -యంగ్ హీరో రానా మ‌ధ్య చిగురించిన ప్రేమ నిన్న పెళ్లి బంధంతో శుభం కార్డు ప‌డింది. పెళ్లిలో మిహీకా పెళ్లి డ్రెస్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింద‌నే టాక్ వినిపిస్తోంది. మిహీక అందంతో ఆమె ధ‌రించిన ఆభ‌ర‌ణాలు…మ‌రీ ముఖ్యంగా డ్రెస్ పోటీ ప‌డ్డాయంటే అతిశ‌యోక్తి కాదు.

వధువు మిహీక బంగారు, క్రీమ్‌ రంగు లెహంగాలో మెరిసిపోయారు. అంతేకాదండోయ్ వాటి ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మిహీక డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేశారు. ఆ డ్రెస్ ఇచ్చిన అనుభూతి కొత్త పెళ్లి కూతురు మిహీకాలో కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. త‌ళ‌త‌ళ మెరిసే పోయే డ్రెస్ అలంక‌రించిన మిహీక‌…కొత్త జీవితంలో అడుగు పెట్ట‌బోయే ఆ మ‌ధుర క్ష‌ణాల‌ను ఆస్వాదించారు.

మిహీక ప్రెళ్లి  డ్రెస్ అంత అద్భుతంగా ఉండ‌డానికి ఎంతో శ్ర‌మ దాగి ఉంది. ఒక‌ట్రెండు గంట‌లు కాదు… వందల గంటల శ్ర‌మిస్తే దానికో అద్భుత రూపు ఇవ్వ‌గ‌లిగార‌ట‌. డ్రెస్‌ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారని స‌మాచారం. అయితే శ్ర‌మ జీవుల క‌ష్టానికి త‌గ్గ పారితోషికాన్ని మిహీక ఇచ్చారు. కేవ‌లం ఈ  డ్రెస్ కోసం మిహీక సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేశారని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే కాదు, గ‌తంలో హల్దీ వేడుకలో ఆమె ధరించిన పసుపు రంగు డ్రెస్‌ కూడా లక్షల ₹2 లక్షలు వుంటుం దంటున్నారు. ఈ డ్రెస్‌ను అర్పితా మెహతా డిజైన్ చేశారు. కొన్ని ప్ర‌త్యేక‌ సంద‌ర్భాల్లో ధ‌రించే డ్రెస్‌ల విలువ కంటే, అవి ఇచ్చే ఆనంద‌మే ప్ర‌ధానం. ఆ సంతోషం ముందు డ‌బ్బు ఏమంత లెక్క‌లోకి రాదు మ‌రి!

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?