నరసింహాన్ ను ఫాలో అవుతున్న తమిళిసై?

ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లడం రాష్ట్రాల్లోని పరిస్థితుల గురించి కేంద్రానికి నివేదికలు ఇవ్వడం.. ఇదీ ఉభయ రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ చేసి పని అంటారు పరిశీలకులు. తరచూ ఢిల్లీ టూర్ కు వెళ్లేవారు నరసింహన్.…

ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లడం రాష్ట్రాల్లోని పరిస్థితుల గురించి కేంద్రానికి నివేదికలు ఇవ్వడం.. ఇదీ ఉభయ రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ చేసి పని అంటారు పరిశీలకులు. తరచూ ఢిల్లీ టూర్ కు వెళ్లేవారు నరసింహన్. ప్రముఖ దేవాలయాల్లో ఎంత ఎక్కువగా కనిపించే వారో అదే విధంగా ఢిల్లీలో కూడా కనిపించే వారాయన. హోంమంత్రితో సమావేశం కావడం, పరిస్థితులను వివరించడం వంటివి గవర్నర్ గా నరసింహన్ రొటీన్ గా చేసేవారనే అభిప్రాయాలున్నాయి.

ఇక తాజాగా తెలంగాణ కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ వెళ్లడం ఆసక్తిదాయకంగా మారింది. అక్కడ ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోడీని, హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఇదంతా మర్యాదకపూర్వకమైన భేటీనే అని తెలుస్తోంది. అయితే ఊహాగానాలకు మాత్రం ఊపు ఉంది. ఒకవైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ నేఫథ్యంలో గతంలో బీజేపీలో తమిళనాడుకు కీలక నేతగా వ్యవహరించిన తమిళి సై ఇప్పుడు తెలంగాణలో పరిస్థితిపై నివేదికలు ఇవ్వడానికే ఢిల్లీ వెళ్లారనే  ప్రచారం సాగుతూ ఉంది.

గతంలో నరసింహన్ ఇలాంటి నివేదికలే ఇచ్చేవారని, ఇప్పుడు తమిళిసై కూడా అలాంటి నివేదికనే కేంద్రానికి సమర్పించిందని ప్రచారం సాగుతూ ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమిళిసైని గవర్నర్ గా నియమించారనే ప్రచారం ఒకటి ఉంది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ నియమిత గవర్నర్ లకు, వేరే పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులకు అస్సలు పడటంలేదు. అయితే తెలంగాణలో ఇప్పటి వరకూ అలాంటి పరిస్థితి ఏమీలేదు. అయితే ఇటీవల ఆర్టీసీ సంఘాల వాళ్లు వెళ్లి గవర్నర్ ను కలవడం, ఇప్పుడు గవర్నర్ ఢిల్లీ వెళ్లడం.. వంటివి విశ్లేషకులకు పని కల్పిస్తూ ఉన్నాయి.

అప్పుడు బ్లాక్ మెయిలర్.. ఇప్పుడు చీటర్.. రవి ప్రకాష్!