రామ్ చరణ్..గౌతమ్ తిన్ననూరి

హీరో రామ్ చరణ్ ఫుల్ వెల్ ప్లానింగ్ లో వున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఏ సినిమాలు చేయాలి అనే విషయంలో ఫుల్ క్లారిటీతో వున్నారు.  Advertisement ఆల్ ఇండియా డైరక్టర్ శంకర్ తో ఓ…

హీరో రామ్ చరణ్ ఫుల్ వెల్ ప్లానింగ్ లో వున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఏ సినిమాలు చేయాలి అనే విషయంలో ఫుల్ క్లారిటీతో వున్నారు. 

ఆల్ ఇండియా డైరక్టర్ శంకర్ తో ఓ సినిమా స్టార్ట్ చేసారు. ఆచార్య లాంటి క్రేజీ కాంబినేషన్ రెడీగా వుంది. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

ఎప్పటి నుంచో ఆయనకు ఓ కోరిక వుంది. తన మిత్రుడు యువి క్రియేషన్స్ విక్రమ్ కోసం ఓ సినిమా చేయాలని ఇప్పుడు అది చేస్తున్నారు. యువి బ్యానర్ లో సినిమా చేయబోతున్నారు. అలాగే తన ఫ్యామిలీ సన్నిహితుడు ఎన్వీ ప్రసాద్ వుండనే వున్నారు. ఆయనను కూడా కలిపారు.

దీనికి కారణం లేకపోలేదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కి ఎన్వీ ప్రసాద్ దగ్గర కమిట్ మెంట్ వుంది. అందుకే ఆయనను కూడా కలిపారు. ఆ విధంగా యువి..ఎన్వీ ప్రసాద్..గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రామ్ చరణ్ సినిమా ఫిక్స్ అయింది. దసరా అనౌన్స్ మెంట్ వస్తోంది.