ఇంటర్నెట్ లో హీరోయిన్లకు సెపరేట్ ప్లేస్ ఉంటుంది. హీరోయిన్ల కొత్త ఫొటోలు, వాళ్ల ఫొటోషూట్లు, సినిమాల కోసం సెర్చ్ చేసే జనం చాలామంది. అలా ఈ ఏడాది కూడా చాలామంది తమ ఫేవరెట్ హీరోయిన్ల కోసం వెదికారు. మరి సౌత్ లో అలా ఎక్కువమంది వెదికిన హీరోయిన్ ఎవరు? గతేడాదిలానే ఈ ఏడాది కూడా ఆ టాప్ పొజిషన్ ను కాజల్ కొట్టేసింది.
నిజానికి సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో కాజల్ ఎక్కువగా పాపులర్ అయింది. పెళ్లి చేసుకోవడం, బాబుకు జన్మనివ్వడం లాంటి అంశాలతో ఆమె పాపులర్ అయింది. ఇక రెండో స్థానంలో సమంత నిలిచింది. ఈమె కూడా తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయింది.
నాగచైతన్య నుంచి విడిపోవడం, అనారోగ్యానికి గురికావడం, విదేశాల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటుందనే పుకార్లు రావడం వంటి అంశాలతో సమంత టాప్ సెర్చ్ లో నిలిచింది. దీనికితోడు ఆమె నటించిన యశోద సినిమాకు మంచి ఆదరణ దక్కడం కూడా సమంతను సెర్ట్ లో నిలిచేలా చేసింది.
ఇక గూగుల్ టాప్ సెర్చ్ హీరోయిన్స్-2022లో మూడో స్థానంలో రష్మిక, నాలుగో స్థానంలో తమన్న నిలిచారు. ఆశ్చర్యకరంగా రకుల్, ఈ ఏడాది తన పాపులారిటీ కోల్పోయింది. ఆమె కోసం సెర్చ్ చేసే జనం బాగా తగ్గిపోయారు. ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో సౌత్ భామలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చూద్దాం..
1. కాజల్, 2. సమంత, 3. రష్మిక, 4. తమన్న, 5. నయనతార, 6. అనుష్క, 7. పూజాహెగ్డే, 8. కీర్తిసురేష్, 9. సాయిపల్లవి, 10.రకుల్ ప్రీత్