సినీ నటుల సంఘం (మా) రాజకీయాలు అచ్చంగా రాజకీయ పార్టీలను తలపిస్తున్నాయి. ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్ వర్గం అంతా తాము సంఘం నుంచి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగిందని, పోస్టల్ బాలెట్లలోఅన్యాయం జరిగిందని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. ఎన్నికలలో తొలి రోజు గెలిచిన వారు రెండో రోజుకు ఎలా ఓడిపోతారని ఆయన ప్రశ్నించారు. తాము రాజీనామా చేసినా, గెలిచిన విష్ణు ఇచ్చిన హామీల అమలుకు ప్రశ్నిస్తామని ఆయన అన్నారు.
మా బైలాస్ లో మార్పు చేయబోమని చెబితే రాజీనామాలను వెనక్కి తీసుకుంటామని ఆయన చెప్పడం విశేషం. మోహన్ బాబు ఎన్నికల ప్రక్రియలోపాల్గొన్నారని ఆయన ఆరోపించారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయని ఆయన అన్నారు.
ప్రకాశ్‌రాజ్ మాటలు నిలకడలేనివిగా కనబడుతున్నాయి. ఒకసారి రాజీనామాని, మరోసారి కండిషన్ పెట్టి విత్ డ్రా చేసుకుంటామని, ప్రశ్నిస్తూనే ఉంటామని ఇలా రకరకాల వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయనలో స్థిరత్వం లేదన్న భావన కలుగుతుంది.