కరోనా రెండో ఫేస్ తరువాత కలెక్షన్ల సంగతి, టికెట్ రేట్ల వ్యవహారం, అన్నీ ఎలా వున్నా, టాలీవుడ్ మాత్రం కళకళలాడుతోంది. ఫంక్షన్ లు, విడుదలలు, ప్రెస్ మీట్లు ఇలా భయంకరమైన హడావుడి జరుగుతోంది. సిటీలో వున్న సినిమా ఫ్యాన్స్ తో మాంచి జోష్ వస్తోంది.
మొన్నటికి మొన్న కొండపొలం ఫంక్షన్ జరిగింది. నిన్నటికి నిన్న బ్యాచులర్ ఫంక్షన్ జరిగింది. అఖిల్, చైతన్య, పూజా హెగ్డే, అల్లు అరవింద్, బన్నీ వాస్ లాంటి వాళ్లతో కళకళలాడింది ఫంక్షన్.
శనివారం నాడు మహాసముద్రం ఫంక్షన్ వుంది. శర్వానంద్..సిద్దార్ధ లాంటి వాళ్లతో ఫంక్షన్ కళకళలాడబోతోంది. ఈ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే పంక్షన్ మళ్లీ ఓ రేంజ్ లో కళకళలాడుతుంది.
ఆదివారం నాడు పెళ్లిసందడి ఫంక్షన్ వుంది. ఈ ఫంక్షన్ కు దర్శకుడు రాఘవేంద్రరావు కోసం హీరోలు చిరంజీవి, వెంకటేష్ ముఖ్య అతిధులుగా హాజరవుతారు.
ఫంక్షన్ లు అన్నీ కాస్త హడావుడిగానే జరుగుతున్నాయి. కాన్సెప్ట్ డెకరేషన్ అనే థీమ్ తో వీటిని జరుపుతుండడంతో, చూడడానికి కాస్త ఆసక్తిగా వుంటున్నాయి. కొండపొలం ఫంక్షన్ కు అడవి థీమ్ ను తయారుచేసి ఆకర్షించారు. దానికి అడవి సౌండ్స్ కూడా యాడ్ చేసారు.
బ్యాచులర్ ఫంక్షన్ కు లాంగెస్ట్ కనోపీ లాంటిది తయారు చేసి అట్రాక్షన్ కలిగించారు. మరి మహా సముద్రం సినిమాకు సముద్రం థీమ్ ను తీసుకువస్తారేమో?
గమ్మత్తేమిటంటే టఫ్ కాంపిటీషన్ వుండే టాలీవుడ్ లో, ఈవెంట్ ఫంక్షన్ మేనేజ్ మెంట్ కు మాత్రం కాంపిటీషన్ లేకపోవడం. అన్ని ఫంక్షన్లు శ్రేయాస్ మీడియా మాత్రమే చేస్తూ వుండడం. ఒకటి రెండు సంస్థలు వచ్చినా నిలదొక్కుకోలేకపోవడం కాస్త ఆశ్చర్యమే.