సమంతను అనలేదు.. కుక్కను కామెంట్ చేశాను

సమంత-నాగచైతన్య విడిపోయిన వెంటనే హీరో సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. ''మోసం చేసిన వాళ్లు మంచిగా బతకలేరు'' అనే అర్థం వచ్చేలా కొటేషన్ పెట్టాడు. దీంతో అంతా సమంతను ఉద్దేశించే సిద్దార్థ్ ఆ ట్వీట్ పెట్టారని…

సమంత-నాగచైతన్య విడిపోయిన వెంటనే హీరో సిద్దార్థ్ ట్వీట్ చేశాడు. ''మోసం చేసిన వాళ్లు మంచిగా బతకలేరు'' అనే అర్థం వచ్చేలా కొటేషన్ పెట్టాడు. దీంతో అంతా సమంతను ఉద్దేశించే సిద్దార్థ్ ఆ ట్వీట్ పెట్టారని అనుకున్నారు. ఎందుకంటే, గతంలో సమంత-సిద్దార్థ్ మధ్య ఎఫైర్ నడిచింది, ఆ తర్వాతే సిద్దార్థ్ కు దూరమై, నాగచైతన్యను పెళ్లి చేసుకుంది సమంత.

ఈ నేపథ్యంలో.. సమంత-చైతూ విడిపోయినప్పుడు సమంతను ఉద్దేశించి సిద్దార్థ్ అలా ట్వీట్ చేశాడని అంతా అనుకున్నారు. కానీ సిద్దార్థ్ మాత్రం ఇది ఒప్పుకోవడం లేదు. తనకు, సమంత ఇష్యూకు సంబంధం లేదంటున్నాడు. తను కేవలం తన ఇంటి బయట ఉన్న కుక్కను ఉద్దేశించి ఆ ట్వీట్ చేశానన్నాడు.

“నేను 12 ఏళ్లుగా ట్వీట్స్ వేస్తున్నాను. ప్రతి ట్వీట్ ను ఓ అర్థం ఉంటుంది. మా ఇంటి బయట చాలా కుక్కలున్నాయని చెప్పాను. ఎవరో వచ్చి నన్ను కుక్క అంటావా అంటే నేనేం చేయాలి. నా లైఫ్ గురించి నేను మాట్లాడతాను. సంబంధం లేకుండా వేరే వ్యక్తులతో లింక్ చేసి అడిగితే అది నా సమస్య కాదు. నాకు, సమంత ఇష్యూకు సంబంధమే లేదు. నేను నా టీచర్ దగ్గర నేర్చుకున్న విషయాన్ని చెప్పాను.”

ఇలా తన ట్వీట్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు సిద్దార్థ్. పైగా తను వేసిన ట్వీట్ కు మహాసముద్రం సినిమాకు లింక్ ఉందని చెబుతున్నాడు. సమంతను ఉద్దేశించి వేసిన ట్వీట్ కాదంటున్నాడు. 

“మహాసముద్రంలో కూడా ఈ టాపిక్ ఉంది. మోసం చేయడం గురించి డైరక్టర్ అజయ్ భూపతితో నేను ఈ విషయంపై మాట్లాడాను. మోసం చేస్తే లైఫ్ లో ఎప్పుడూ బాగుపడరనే సందేశం మహాసముద్రంలో కూడా ఉంది. ఆ డిస్కషన్ లో నాకు బాగా నచ్చి ఆ కొటేషన్ ను వెంటనే ట్వీట్ చేశా. ఆమాత్రం దానికే ప్రపంచంలోని మోసగాళ్లంతా వచ్చి నన్ను ప్రశ్నిస్తే నేనేం చేయగలను.”

సిద్దార్థ్ చాలా తెలివైనోడు. కర్ర విరక్కుండా, పాము చావకుండా తెలివిగా ట్వీట్లు వేయడంలో పండిపోయాడు. తన ట్వీట్లతో బీజేపీ నేతల్నే ముప్పుతిప్పలు పెట్టిన ఈ నటుడికి, సమంతపై వేసిన పోస్ట్ ను కవర్ చేసుకోవడం పెద్ద లెక్క కాదు.