చైతూ మంచోడు.. విడాకులపై మాత్రం స్పందించను

నాగచైతన్య-సమంత విడాకులపై స్పందించడానికి రాజీవ్ కనకాల నిరాకరించాడు. తాజాగా రిలీజైన లవ్ స్టోరీ సినిమాలో చైతన్యతో కలిసి తొలిసారి నటించిన రాజీవ్ కనకాల.. విడాకుల విషయంపై స్పందించే రైట్ తనకు లేదంటున్నాడు. Advertisement “నాగచైతన్య-సమంత…

నాగచైతన్య-సమంత విడాకులపై స్పందించడానికి రాజీవ్ కనకాల నిరాకరించాడు. తాజాగా రిలీజైన లవ్ స్టోరీ సినిమాలో చైతన్యతో కలిసి తొలిసారి నటించిన రాజీవ్ కనకాల.. విడాకుల విషయంపై స్పందించే రైట్ తనకు లేదంటున్నాడు.

“నాగచైతన్య-సమంత విడాకులపై నేను స్పందించను. అది వాళ్ల వ్యక్తిగతం. దాన్ని అలాగే వదిలేద్దాం. వాళ్లు విడిపోవడం చాలామందికి బాధ కలిగించింది. నాకు కూడా బాధగానే ఉంది. అక్కడితో ఆపేద్దాం. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో నాకే కాదు, ఎవ్వరికీ ఏం తెలియదు. కాబట్టి వాళ్ల జీవితాలపై స్పందించే అర్హత మనకు లేదు.”

సమంత, నాగచైతన్య నుంచి ఎందుకు విడిపోయిందో తనకు తెలియదు కానీ.. చైతన్య మాత్రం చాలా మంచోడు అంటున్నాడు రాజీవ్ కనకాల. విపరీతమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ హీరోను, అంత సాదాసీదాగా చూడడం తనకు అదే ఫస్ట్ టైమ్ అన్నాడు.

“చైతన్య చాలా మంచోడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. విసుగు అంటే ఏంటో తెలీదు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ప్రేమిస్తారు అతడ్ని. అలాంటి మంచి నేచర్ నాగచైతన్యది. చాలామంచి మనిషి. హీరో అనే భేషజాలు లేవు. సెట్స్ కి ఎప్పుడు వచ్చేవాడో కూడా తెలిసేది కాదు. అలా వచ్చి ఓ పక్కన  నిల్చునేవాడు.”

త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై కూడా రాజీవ్ స్పందించాడు. తను మంచు విష్ణు ప్యానెల్ ను సపోర్ట్ చేస్తున్నానని, మరీ ముఖ్యంగా ఆ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీచేస్తున్న రఘుబాబుకు పూర్తి మద్దతు ఇస్తున్నానని తెలిపాడు. అలాఅని తనకు జీవిత రాజశేఖర్ పై ఎలాంటి వ్యతిరేకత లేదంటున్నాడు. రఘుబాబు తనకు బాగా సన్నిహితుడు కాబట్టే మద్దతిస్తున్నానని క్లారిటీ ఇచ్చాడు.