మా ఎన్నికల నేపథ్యంలో ఆర్టిస్ట్ రవిబాబు కూడా గొంతు విప్పారు. కాస్త లాజికల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఓ వీడియో బైట్ అందించారు. ఇది లోకల్..నాన్ లోకల్ అనే ఇస్యూ కాదనంటూనే ఆయన టాలీవుడ్ తీరుతెన్నులను ఎండ గట్టారు.
ఇక్కడ బోలెడు మంది నటులు వున్నా, పరాయి భాష నటులను తెచ్చి, వారి డిమాండ్లకు తలవొగ్గి, వారిని పెంచి పోషిస్తున్నారు. ఆప్ కోర్స్ పాత్రలకు తగ్గ నటులు ఇక్కడ లేరనో? లేదా పక్క భాషల వారిని తీసుకుంటే డబ్బింగ్ రైట్స్ రూపంలో డబ్బులు గట్టిగా వస్తాయనో చేస్తూ వుండి వుండొచ్చు.
ఇక్కడ దాదాపు 150 మంది కెమేరా మెన్లు పనిలేకుండా పడి వున్నారు. వాళ్ల సత్తా సరిపోదనేమో, పక్క భాషల కెమేరా మెన్ లను తెచ్చుకుంటున్నారు. చివరికి వాళ్లు ఇచ్చే బిల్లులు చూసి గుండె బాదుకుంటున్నారు. ఆఖరికి హెయిర్ డ్రెస్సర్ లను, మేకప్ మెన్ లను కూడా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారు.
ఇది ఎక్కడకు చేరింది అంటే మా అనే అతి చిన్న ఆర్గనైజేషన్ నడపడానికి కూడా పక్క భాషల నుంచి తెచ్చుకోవాలా? ఆలోచించండి..ఇది లోకల్..నాన్ లోకల్ ఇస్యూ కాదు.
అంటూ రవిబాబు వీడియో బైట్ వదిలారు. కాస్త ఆలోచింపచేసేలాగే వుంది.