అలా ఉంటేనే ఆనందం అంటున్న శృతిహాసన్

కొంతమందికి డబ్బు ఉంటే ఆనందం, మరికొందరకి బంగ్లాలు ఉంటే ఆనందం. ఇంకొందరికి చేతి నిండా పని ఉంటే ఆనందం. మరి హీరోయిన్ శృతిహాసన్ కు జీవితంలో ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఇదే ప్రశ్న ఆమెకు ఎదురైంది.…

కొంతమందికి డబ్బు ఉంటే ఆనందం, మరికొందరకి బంగ్లాలు ఉంటే ఆనందం. ఇంకొందరికి చేతి నిండా పని ఉంటే ఆనందం. మరి హీరోయిన్ శృతిహాసన్ కు జీవితంలో ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఇదే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి శృతిహాసన్ ఇచ్చిన సమాధానం నెటిజన్ల మనసు గెలుచుకుంది. నిజాయితీగా జీవించడంలో ఉన్న ఆనందం మరెందులో దొరకదని సమాధానం ఇచ్చింది శృతి.

రాత్రి కొన్ని గంటల పాటు వాట్సాప్, ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్ పనిచేయలేదు. దీంతో తను ఒక్కసారిగా ఫ్రీ అయిపోయానని, పనిచేస్తున్న ట్విట్టర్ లోనే మాట్లాడుకుందాం రమ్మంటూ ఫ్యాన్స్ ను ఆహ్వానించింది శృతిహాసన్. ఈ సందర్భంగా తనకు ఎదురైన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది.

ఈ ఏడాది తను చూసిన మంచి పనుల్లో ఉత్తమమైంది వ్యాక్సినేషన్ మాత్రమే అని తెలిపిన శృతిహాసన్.. తన మ్యూజిక్ బ్యాండ్ కు సంబంధించి లోకల్ టాలెంట్ ను కూడా అహ్వానిస్తున్నట్టు తెలిపింది. జీవితాన్ని ఆస్వాదించడం, ఆనందంగా ఉండడం తన తండ్రి కమల్ హాసన్ ను చూసి నేర్చుకున్నానని తెలిపింది.

లండన్ ను బాగా మిస్ అవుతున్నానని ప్రకటించిన శృతిహాసన్.. ప్రపంచ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత అస్సాం, నేపాల్ లో పర్యటించాలనుకుంటున్నట్టు తెలిపింది. ప్రతి దశాబ్దంలో సంగీతానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉందన్న ఈ బ్యూటీ.. తనకు మాత్రం 70వ దశకం నాటి సంగీతం అంటే ఇష్టమంటోంది.

మైఖేల్ జోర్డాన్, సచిన్ టెండూల్కర్ ను తన ఫేవరెట్ క్రీడాకారులుగా చెప్పిన శృతిహాసన్.. ది లిటిల్ ప్రిన్స్ అనే పుస్తకం తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ఇక తండ్రితో దిగిన ఫొటోల్లో తనకు ఇష్టమైన ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. ఈ ఫొటోలో శృతిహాసన్ చెల్లెలు అక్షరహాసన్ కూడా ఉంది.