హీరోగారి పెళ్లాం ఖర్చు జోరు

హీరో అంటేనే కాస్త డబ్బులుంటాయి. టాప్ హీరో అంటే డబ్బులకు లోటుండదు. పైగా సినిమాలు చేతిలో వున్నంత కాలం తమ చిల్లర ఖర్చులు అన్నీ నిర్మాత మీద పడేసే వారు ఎక్కువశాతం మంది. అలాంటి…

హీరో అంటేనే కాస్త డబ్బులుంటాయి. టాప్ హీరో అంటే డబ్బులకు లోటుండదు. పైగా సినిమాలు చేతిలో వున్నంత కాలం తమ చిల్లర ఖర్చులు అన్నీ నిర్మాత మీద పడేసే వారు ఎక్కువశాతం మంది. అలాంటి ఓ టాప్ హీరో భార్య చేసే ఖర్చు మామూలుగా వుండదని గ్యాసిప్ వినిపిస్తోంది.

ఆమెకు అంటూ స్వంత కంపెనీలు, లేవు, బ్యాంకింగ్ లేదు. సంపాదన లేదు. కానీ ఖర్చు మాత్రం ఓ రేంజ్ లో వుంటుందట. సిటీలోని తన స్నేహితులతో ఇంట్లో ఇచ్చే పార్టీలకు ఓ రేంజ్ లో ఖర్చు అవుతుందట. 

పైగా ఇది మాత్రమే సమస్య కాదు సదరు హీరోగారికి. ఆయనకు కాస్త ప్రశాంతంగా వుండడం ఇష్టం. కానీ ఇంట్లో పార్టీ అంటూ పెడితే హడావుడి, గోల మామూలుగా వుండదట. 

అలాగే ఏదైనా పండగ పబ్బం వస్తే గిఫ్ట్ షాపింగ్ అంతా విదేశాల్లోనే. కార్డులు పట్టుకుని వెళ్లడం, అక్కడ గోకేసి, లగేజీతో రావడం అంట. పాపం హీరోగారు ఏం మాట్లాడగలరు? ఎంతయినా భార్య కదా. ఇలాంటి కబుర్లు అనేకం వినిపిస్తున్నాయి సదరు హీరోగారి ఫ్యామిలీ గురించి.