శ‌క‌ల‌క శంక‌ర్‌లో శ్రీ‌రెడ్డి నిజాయతి ఏదీ?

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ‘ప‌వ‌ర్‌స్టార్’ వ‌ర్సెస్ ‘ప‌రాన్న‌జీవి’ అనే రియ‌ల్ సినిమా న‌డుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా పోటా పోటీగా ఈ నెల 25న విడుద‌ల కానున్నాయి. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ నేతృత్వంలో ప‌వ‌ర్‌స్టార్…

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ‘ప‌వ‌ర్‌స్టార్’ వ‌ర్సెస్ ‘ప‌రాన్న‌జీవి’ అనే రియ‌ల్ సినిమా న‌డుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా పోటా పోటీగా ఈ నెల 25న విడుద‌ల కానున్నాయి. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు వ‌ర్మ నేతృత్వంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వ్యంగ్యాత్మ కంగా ‘ప‌వ‌ర్‌స్టార్’ తెర‌కెక్కింది. ఈ సినిమాకు కౌంట‌ర్‌గా వ‌ర్మ‌పై సెటైరిక్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ నూత‌న్ నాయుడు నేతృత్వంలో ‘ప‌రాన్న‌జీవి’ తెర‌కెక్కింది. ప‌రాన్న‌జీవిలో వ‌ర్మ పాత్ర‌ను జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ శ‌క‌ల‌క శంక‌ర్ పోషిస్తున్నాడు. ఇటీవ‌ల డైరెక్ట‌ర్ వ‌ర్మ‌పై శంక‌ర్ వెల్ల‌డించిన అభిప్రాయాల‌ను ప‌రిశీలిద్దాం.

‘నాకు ఇన్‌స్పిరేష‌న్ మొత్తం వ‌ర్మానే. ఈ రోజు నా జీవితం బాగుందంటే, జ‌నాల్లో నాకు ఇమేజ్ రావ‌డానికి కార‌ణం ఇద్ద‌రే ఇద్ద‌రు వ్య‌క్తులు. వాళ్ల‌ద్ద‌రిలో ఒక‌రు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మ‌రొక‌రు ద‌ర్శ‌కుడు ఆర్జీవీ. నా కెరీర్‌లో, జీవితంలో ఈ ప్ర‌పంచం ఉన్నంత వ‌ర‌కూ వాళ్ల‌ద‌రి పేర్లు ఎప్ప‌టికీ ఉంటాయి’ అని ఎంతో గొప్ప‌గా చెప్పాడు.

‘ప‌రాన్న‌జీవి’ సినిమాలో న‌టించాల‌ని త‌న‌పై ఎంతో ఒత్తిడి తెచ్చార‌ని క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో పాపుల‌ర్ అయిన న‌టి శ్రీ‌రెడ్డి తెలిపారు. అయితే ఆ సినిమాలో న‌టించేందుకు ఒప్పుకోలేద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె కార‌ణాల‌ను కూడా వెల్ల‌డించారు. ఆమె ఏమ‌న్నారంటే…

‘ప‌రాన్నజీవి సినిమాలో న‌టించాల‌ని ఎంతో ఒత్తిడి చేశారు. అయితే రాంగోపాల్‌వ‌ర్మ‌పై ఇష్టం వ‌ల్లే ఆ సినిమాలో న‌టించేందుకు నో అని చెప్పాల్సి వ‌చ్చింది. నాకు కొన్ని విలువ‌లున్నాయి. కేవ‌లం డ‌బ్బే కావాల‌నుకుంటే సంపాదించుకునేందుకు అనేక మార్గాలున్నాయి. నా అనుకునే సొంత వాళ్ల గౌర‌వానికి ఎప్పుడూ ఇబ్బంది క‌లిగించ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో ప‌రాన్న‌జీవి సినిమాలో న‌టించ‌లేదు’ అని శ్రీ‌రెడ్డి చెప్పారు. వ‌ర్మ‌పై మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో త‌న ప్రేమాభిమానాల‌ను చూపి నిజాయ‌తీ చాటుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదే శ‌క‌లక శంక‌ర్ విష‌యానికి వ‌స్తే మాట‌ల్లో మాత్రం వ‌ర్మంటే ‘నాకు అంతా, ఇంతా’ అని గొప్ప‌లు చెబుతాడు. తీరా ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తే మాత్రం వ‌ర్మ‌ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తూ…ఇదేంద‌య్యా అని ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, లాక్‌డౌన్‌, ఆదాయం అంటూ మాట‌లు చెబుతాడు. శ‌క‌ల‌క శంక‌ర్‌కు, శ్రీ‌రెడ్డికి ఇదే తేడా అని వ‌ర్మ అభిమానులు దెప్పి పొడుస్తున్నారు. శ‌క‌ల‌క శంక‌ర్ రీల్‌లోనే కాదు…రియ‌ల్ లైఫ్‌లోనూ న‌టిస్తాడ‌నేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ అంటున్నారు.

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్