‘కథ’ కొత్తగా వుంది

కొత్త తరం వస్తున్న కొద్దీ కథలను కొత్తగా చెప్పాలన్న తపన తొంగిచూస్తోంది టాలీవుడ్ లో. బైక్ రైడింగ్ నేపథ్యంలో నాలుగు కథలు లింక్ చేసి ఓ సినిమాగా రూపొందించాలనే ఆలోచనతో తయారైన సినిమా 'ఇదీ…

కొత్త తరం వస్తున్న కొద్దీ కథలను కొత్తగా చెప్పాలన్న తపన తొంగిచూస్తోంది టాలీవుడ్ లో. బైక్ రైడింగ్ నేపథ్యంలో నాలుగు కథలు లింక్ చేసి ఓ సినిమాగా రూపొందించాలనే ఆలోచనతో తయారైన సినిమా 'ఇదీ మా కథ'. ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది.

చూడగానే ఎవరికైనా అనిపించే భావన ఒక్కటే. ఏదో కాస్త డిఫరెంట్ గా ట్రయ్ చేసినట్లున్నారు అనేదే ఆ ఫీలింగ్. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక తదితరులు నటించిన ఈ సినిమా మొత్తం బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తీసారని ట్రయిలర్ నే చెబుతోంది.

కేవలం ఒక్క కథ కాకుండా నలుగురు రైడర్ల కథలు మేళవించి రూపొందించారు. నిజానికి రోడ్ మూవీలు తీయడం చాలా కష్టం. ఒకటి ఖర్చు, ప్రయాస. రెండు బోర్ లేకుండా తీయడం అన్నది కత్తి మీద సాము. 

ఎమోషనల్ స్టోరీలు మిక్స్ చేస్తూ, బైక్ రైడింగ్ బ్యాక్ డ్రాప్ లో కొత్త అందాలు, కొత్త ప్రదేశాలు చూపిస్తూ ఇంట్రస్టింగ్ గానే కట్ చేసారు ట్రయిలర్ ను. లడాఖ్ ప్రాంతానికి బైక్ రైడింగ్ కు యూత్ వెళ్లడం చాలా పాపులర్. అదే డెస్టినేషన్ సినిమాకూ తీసుకున్నారు.

చాలా రోజుల తరువాత శ్రీకాంత్ కాస్త డిఫరెంట్ రోల్ లో కనిపించాడు. సుమంత్ అశ్విన్ కు కూడా ఈ తరహా క్యారెక్టర్ కొత్తే. మహేష్ నిర్మించిన ఈ సినిమాకు గురుపవన్ దర్శకుడు.