జనసేనాని పవన్‌కల్యాణ్ బహిరంగ సభా వేదికపై నుంచి గొంతు చించుకుని చెప్పినా నిర్మాత దిల్‌రాజ్ పట్టించుకోలేదు. మళ్లీ ఆయన కాపు నాయకుడు దగ్గరికే వెళ్లారు. తనతో పాటు మరికొందరు నిర్మాతలను వెంటబెట్టుకుని మంత్రి పేర్ని నానిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో జనసేనాని పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులపై తన అక్కసు వెళ్లగక్కారు. ఆయన మాట్లాడుతూ … దిల్‌రాజు నాతో ‘వకీల్‌సాబ్’ ఎందుకు చేశారు? నాతో ఆ సినిమా తీయకపోతే ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు విడుదలై ఉండేవి.
‘మీరు రెడ్డే, ఏపీ సీఎం కూడా రెడ్డే. జగన్‌కు రెడ్లు అంటే బాగా అభిమానం కదా!అదేదో మీరు మీరు చూసుకోండి’ అంటూ వెటకారంగా పవన్ అన్న సంగతి తెలిసిందే. ఈ మాటలు అంటున్నప్పుడు దిల్‌రాజ్ కూడా పడిపడి నవ్వుతూ కనిపించారు.
ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో ఉన్న మంత్రి పేర్ని నాని దగ్గరకు నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు కాసేపటి క్రితం వెళ్లడం టాలీవుడ్లో ఆసక్తికర పరిణామంగా చెప్పొచ్చు. మంత్రి నివాసంలో పేర్ని నానితో నిర్మాతలు సమావేశమై తాజా వివాదాస్పద పరిణామాలపై చర్చించారని సమాచారం. మరీ ముఖ్యంగా తనను పవన్‌కల్యాణ్ సన్నాసి అనడం, దానికి కౌంటర్‌గా సన్నాసిన్నర అని విమర్శలు చేయడం తెలిసిందే.
సినీ పరిశ్రమపై జగన్ ప్రభుత్వం కోపంగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత మంత్రి పేర్ని నానితో నిర్మాతల భేటీ సానుకూల వాతావరణాన్ని ఏర్పరస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భేటీ వివాదాలకు తెరదించుతుందని ఆశిద్దాం.