పవన్ ను వైసీపీలో చేర్చుకోలేదు.. అదే ఆయన కోపం

ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ హాట్ గా నడుస్తున్న పవన్-పోసాని వివాదంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. పవన్ కు ఎందుకు జగన్ అంటే అంత కోపమో బయటపెట్టారు. Advertisement “పవన్…

ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ హాట్ గా నడుస్తున్న పవన్-పోసాని వివాదంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. పవన్ కు ఎందుకు జగన్ అంటే అంత కోపమో బయటపెట్టారు.

“పవన్ కు మాట్లాడ్డం చేతకాదు. ఎప్పుడు ఏ పార్టీతో ఉంటాడో కూడా తెలీదు. గతంలో వైసీపీలో చేరడానికి చాలా ప్రయత్నించారు. జగన్ వద్దన్నారు. తను చేసిన ప్రజాసంకల్పయాత్ర, తనపై ప్రజలకు ఉన్న ప్రేమే తనను గెలిపిస్తుందన్నారు. పవన్ ను పార్టీలో చేర్చుకోలేదు. ఆ కోపం పవన్ కల్యాణ్ లో అలా ఉండిపోయింది.”

ఇలా పవన్ ఎపిసోడ్ కు కొత్త ట్విస్ట్ ఇచ్చారు నారాయణ స్వామి. ఆడవాళ్లను హింసించే పవన్ గురించి మాట్లాడి తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోనన్నారు.

“పవన్  కల్యాణ్ గురించి మాట్లాడితే అది నా వ్యక్తిత్వానికి దెబ్బ. ఆయనకు క్యారెక్టర్ లేదు. మహిళలకు అన్యాయం జరిగితే ప్రత్యక్షమౌతా అంటారు. మరి ఆయన ద్వారా దెబ్బతిన్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. ఆయన ద్వారా ఆహుతి అయిన మహిళ కూడా ఇస్తున్న స్టేట్ మెంట్స్ చూస్తున్నాం. ఈయన క్యారెక్టర్ చూసే ప్రజలు తిరస్కరించారు.”

ఏ కులం కోసం పవన్ కల్యాణ్ గొంతు చించుకుంటున్నారో ఆ కులమే పవన్ ను ఓడిస్తుందని జోస్యం చెప్పారు నారాయణ స్వామి. కులం పేరిట నాయకుడిగా ఎదిగిన నేతలు ఎవ్వరూ లేరని, పవన్ కూడా నాయకుడు కాలేడని అన్నారు.