విశాఖ… డిజిటల్ హబ్…

ఎవరు అవునన్నా కాదన్నా విశాఖ రాజసం ఎప్పటికీ తగ్గదు, పేరుకు ముందు రాజధాని అని ఉన్నా లేకపోయినా కూడా విశాఖ ఘన కీర్తి కూడా ఎక్కడా తగ్గదు. అది అందరికీ తెలిసిన విషయమే. సిటీ…

ఎవరు అవునన్నా కాదన్నా విశాఖ రాజసం ఎప్పటికీ తగ్గదు, పేరుకు ముందు రాజధాని అని ఉన్నా లేకపోయినా కూడా విశాఖ ఘన కీర్తి కూడా ఎక్కడా తగ్గదు. అది అందరికీ తెలిసిన విషయమే. సిటీ ఆఫ్ డెస్టినీ అని విశాఖకు మరో పేరుగా చెబుతారు.

అటువంటి విశాఖ ఇపుడు డిజిటల్ హబ్ గా మారుతోంది. అవును ఇది నిజమే. విభజనకు ముందు కూడా హైదరాబాద్ తరువాత ఐటీపరంగా అభివృద్ధి చెందిన నగరం, రెండవ సిటీగా విశాఖను చెప్పేవారు. ఇపుడు ఏపీకి ఏకైక పెద్ద సిటీగా ఉన్న విశాఖ తన బాధ్యతను పాత్రను మరింతగా పెంచుకుంది.

విశాఖలో డిజిటల్ మార్కెటింగ్ గత కొన్నాళ్ళుగా పెరిగింది. అదే టైమ్ లో అనేక కంపెనీలు కూడా ఈ రంగంలో విశేష సేవలు అందిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా విశాఖ రాబోతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ మేరకు అవసరం అయిన ఊతమిచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.

ఒక అంచనా ప్రకారం చూసుకుంటే రానున్న మూడు నాలుగేళ్లలో విశాఖ డిజిటల్ హబ్ గా పూర్తి స్థాయిలో అవతరిస్తుందని, ఈ రంగంలో కనీసంగా పాతిక వేలకు తక్కువ కాకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంటున్నారు. 

ఈ నేపధ్యంలో విశాఖ రాజధాని కూడా అయితే ఇంకా ముందుగానే డిజిటల్ విప్లవంతో విశాఖ సౌత్ లో నంబర్ వన్ సిటీగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.