హీరోయిన్ కు రేప్ థ్రెట్స్, స్పందించిన మంత్రి

త‌న‌ను చంపుతామంటూ, త‌న‌పై అత్యాచారం చేస్తామంటూ కొంత‌మంది సోష‌ల్ మీడియాలో బెదిరిస్తూ ఉన్నార‌ని న‌టి రియా చ‌క్ర‌బ‌ర్తి కంప్లైంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య కు…

త‌న‌ను చంపుతామంటూ, త‌న‌పై అత్యాచారం చేస్తామంటూ కొంత‌మంది సోష‌ల్ మీడియాలో బెదిరిస్తూ ఉన్నార‌ని న‌టి రియా చ‌క్ర‌బ‌ర్తి కంప్లైంట్ చేసిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య కు కార‌ణం ఆమేనంటూ ఆ హీరో అభిమానులు కొంద‌రు భావిస్తున్న‌ట్టున్నారు. ఈ క్ర‌మంలో వారు రియాను టార్గెట్ గా చేసుకున్నట్టున్నారు.

సోష‌ల్ మీడియాలో హీరోయిన్ల‌ను ఈ త‌రహాలో బెదిరించ‌డం కొంద‌రు ముష్క‌రులకు అల‌వాటుగా మారింది. రియాకు కూడా అలాంటి బెదిరింపులే త‌ప్ప‌న‌ట్టుగా ఉన్నాయి. ఈ విష‌యంపై ఆమె స్పందిస్తూ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు సోష‌ల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసింది. త‌న‌ను అకార‌ణంగా నిందిస్తూ, ఏడిపిస్తున్నార‌ని.. సుశాంత్ మ‌రణంపై విచార‌ణ చేయించాల‌ని ఆమె కోరింది. ఈ విష‌యంపై కేంద్రం ఏం స్పందించ‌లేదు కానీ, మ‌హారాష్ట్ర మంత్రి ఒక‌రు రియాక్ట్ అయ్యారు.

మ‌హారాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్పందిస్తూ రియా ఫిర్యాదుపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టుగా తెలిపారు. ఆమెను సోష‌ల్ మీడియాలో బెదిరిస్తున్న వారిపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో త‌ను మ‌హారాష్ట్ర హోం మంత్రితో మాట్లాడి, ఆమెను వేధిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకునేలా చూస్తానంటూ ఆ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు రియా ఫిర్యాదు మేర‌కు ఆమెకు అభ్యంత‌క‌ర‌మైన మెసేజ్ ల‌ను పంపిన ఇద్ద‌రు ఇన్ స్టాగ్ర‌మ్ యూజ‌ర్ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేసిన‌ట్టుగా స‌మాచారం. ఆమెను చంపుతామంటూ, ఆమెపై అత్యాచారం చేస్తామంటూ మెసేజ్ చేసిన వారిని గుర్తించి కేసులు న‌మోదు చేసే ప‌నిలో ఉన్న‌ట్టున్నారు ముంబై సైబ‌ర్ క్రైమ్ పోలీసులు.