రాజశేఖర్ కు హీరోయిన్ దొరికింది

సీనియర్ హీరో రాజశేఖర్ కొత్త ప్రాజెక్టు ఈ మధ్యనే అనౌన్స్ అయింది. ఈ సినిమాకు హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు. నందిత శ్వేతను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రేమకథాచిత్రమ్ 2,…

సీనియర్ హీరో రాజశేఖర్ కొత్త ప్రాజెక్టు ఈ మధ్యనే అనౌన్స్ అయింది. ఈ సినిమాకు హీరోయిన్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు. నందిత శ్వేతను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రేమకథాచిత్రమ్ 2, అభినేత్రి 2, 7 వంటి సినిమాలతో నందిత శ్వేత తెలుగువారికి బాగానే పరిచయం అయిపోయింది. త్వరలో అక్షర అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా కూడా రాబోతోంది. అలా కెరీర్ ట్రాక్ పెంచుకుంటూ నందిత ఇప్పుడు రాజశేఖర్ సరసన చాన్స్ వరకు వచ్చింది.

రాజశేఖర్ సినిమాకు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకుడు. ఈ సినిమాకు జాన్ మహేంద్రన్ స్క్రిప్ట్, తదితర గ్రౌండ్ వర్క్ అంతా చేయడం విశేషం. జాన్ మహేంద్రన్ తమిళంలో మంచి దర్శకుడు, మాటల రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆయన, ఆయన టీమ్ కలిసి అందిస్తున్న స్క్రిప్ట్, డైలాగ్ వెర్షన్ నే, ప్రదీప్ సినిమాగా రూపొందించబోతున్నారు. ఈ సినిమాకు నిర్మాత క్రియేటివ్ ఎంటర్ టైనర్స్, అండ్ డిస్ట్రిబ్యూటర్స్ జి ధనుంజయన్.

తన భయం.. రాష్ట్రంపై రుద్దితే ఎలా?