ప్రస్తుతం లాక్ డౌన్ సమయం నడుస్తోంది. పెద్ద పెద్ద డైరక్టర్లు అంతా ఖాళీగా వున్నారు. అందరికీ ఒకటికి రెండు కమిట్ మెంట్లు చేతిలో వున్నాయి కానీ, ప్రస్తుతానికి అయితే ఖాళీ. పైగా హీరో ల డేట్ లు దొరకాలి అంటే కాస్త టైమ్ పట్టేలా వుంది. టాప్ లైన్ డైరక్టర్లే కాదు. ఇంతో అంతో కాస్త పేరున్న డైరక్టర్లదీ ఇదే పరిస్థితి.
ఇలాంటి నేపథ్యంలో ఆహా ఓటిటి సంస్థ నుంచి చాలా మంది డైరక్టర్లకు ఆఫర్ల రూపంలో మొహమాటం ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో ఓ వెబ్ సిరీస్ కానీ, చిన్న సినిమా కానీ, ఇండిపెండెట్ ఫిల్మ్ కానీ ఏదో ఒకటి చేసి పెట్టమని టాప్ లైన్ డైరక్టర్లు అందరినీ ఆహా నిర్వాహకులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే టాప్లైన్ డైరక్టర్లు ఇప్పుడే వెబ్ సిరీస్ దారిలో అడుగుపెట్టడానికి అంతగా సుముఖంగా కనిపించడం లేదు. నిర్మాత దిల్ రాజు కొంద మంది యంగ్ డైరక్టర్లను చేరదీసి వెబ్ కోసం చిన్న సినిమాలు నిర్మించే పని ప్రారంభించారు. కృష్ణ లీల హీరో సిద్దును అడిగారని, అయితే ముందుగా ఓ మెయిన్ స్ట్రీమ్ సినిమా చేయాలని వుందని తెలిపినట్లు తెలుస్తోంది.
ఓటిటి వరల్డ్ లో ఇటీవలే ప్రవేశించిన ఆహా ను నిలబెట్టేందుకు దాని యజమానులు గట్టిగా కృషి చేస్తున్నారు. భాగస్వాములు అంతా ఎవరికి వారు వారి వారి పలుకుబడి వాడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు మారుతి ఓ వెబ్ సిరీస్ తయారుచేసే పనిలో వున్నారు. మొత్తం మీద మా టీవీని నిలబెట్టినట్లే, గట్టి స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది అరవింద్ అండ్ టీమ్.