వీరప్పన్ అంటే అందరికీ తెలుసు కదా. మరి విశాఖ వీరప్పన్ అంటే తెలుసా. అయితే దానికి జవాబు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ ని అడగాల్సిందే. విశాఖ వీరప్పన్ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అని గుడివాడ అంటున్నారు.
ఆయన విశాఖ ఏజెన్సీలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చాలా అక్రమాలు చేశారని గుడివాడ ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెడ్డ పేరు తెచ్చినవారుగా అయ్యన్న పేరే చెప్పుకోవాలని గుడివాడ పేర్కొనడం విశేషం.
అంతే కాదు ఈ మధ్య దాకా వైసీపీ మీద అనరాని మాటలతో తెగ హడావుడి చేసిన అయ్యన్న పరిషత్ ఎన్నికల ఫలితాల తరువాత ఫుల్ సైలెంట్ ఎందుకు అయ్యారు అని గుడివాడ ప్రశ్నించడం విశేషం.
పరిషత్ ఫలితాలతో టీడీపీకి, చంద్రబాబుకు, అయ్యన్నకు ఒకేసారి చుక్కలు కనిపించాయని గుడివాడ సెటైర్లు వేసారు. మొత్తానికి అయ్యన్న మీద ఘాటైన విమర్శలే గుడివాడ చేశారనుకోవాలి. అలా అయ్యన్నను మళ్ళీ వైసీపీ ముగ్గులోకి లాగుతోంది. వైసీపీకి అయ్యన్న ఏ విధంగా కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సిందే.