అత‌డి కౌగిలిలో ముద్ద‌యిన జాన్వీ క‌పూర్!

కిస్సులు, హ‌గ్గులు, ఆ సాన్నిహిత్యంలోని త‌న్మ‌య‌త్వం.. ఇదంతా జాన్వీ క‌పూర్ న‌టించిన ఈ సినిమా సీన్ వ‌ర్ణ‌నో కాదు, ఒక పార్టీలో ఆమె తన సన్నిహితుడి కౌగిలిలో ముద్ద‌య్యింది. బుగ్గ‌ల‌పై అత‌డి ముద్దుల‌తో పుల‌కించిపోయింది.…

కిస్సులు, హ‌గ్గులు, ఆ సాన్నిహిత్యంలోని త‌న్మ‌య‌త్వం.. ఇదంతా జాన్వీ క‌పూర్ న‌టించిన ఈ సినిమా సీన్ వ‌ర్ణ‌నో కాదు, ఒక పార్టీలో ఆమె తన సన్నిహితుడి కౌగిలిలో ముద్ద‌య్యింది. బుగ్గ‌ల‌పై అత‌డి ముద్దుల‌తో పుల‌కించిపోయింది. ఇందుకు సంబంధించి ఫొటోల‌ను ఆమె స్వ‌యంగా షేర్ చేసింది. ఈ నేప‌థ్యంలో అత‌డెవ‌ర‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. శ్రీదేవి త‌న‌య‌గా, సొంతంగా హీరోయిన్ గా దూసుకుపోతున్న జాన్వీ క‌పూర్ కు సంబంధించి ప్రేమ‌క‌థ ఊహాగానాలు మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కాయి.

గ‌తంలో కూడా జాన్వీ విష‌యంలో ఇలాంటి వార్త‌లు వ‌చ్చాయి. త‌న తొలి సినిమా హీరోతో ఈమె చాలా సాన్నిహిత్యంతో ఉంటుంద‌ని, వారిద్ద‌రి మ‌ధ్య‌నా ప్రేమ‌క‌థ న‌డుస్తోంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఆ సినిమా విడుద‌ల త‌ర్వాత‌..  ఆ పుకార్లు నెమ్మ‌దిగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే అప్ప‌ట్లో అత‌డి ఒళ్లో కూర్చుని జాన్వీ స‌ర‌దాగా పిచ్చాపాటి మాట్లాడే ఫొటోలు బాగా వైర‌ల్ అయ్యాయి.

ఇక తాజాగా ఒక పార్టీలో అక్ష‌త్ రాజ‌న్ అనే కుర్రాడితో జాన్వీ క‌పూర్ బాగా సాన్నిహిత్యాన్ని క‌న‌బ‌రిచింది. వీరిద్ద‌రూ హ‌గ్ చేసుకుని ఫొటోల‌కు పోజులు ఇచ్చారు. అత‌డు చొర‌వ తీసుకుని జాన్వీ క‌పూర్ బుగ్గ‌ల‌పై ముద్దులు పెడుతూ, కౌగిలించుకుంటూ పోజులిచ్చాడు. ఆ ఫొటోల‌ను జాన్వీ షేర్ చేసింది. 

అలాగే ఆ పార్టీలో జాన్వీ చెల్లెలు ఖుషీ క‌పూర్ కూడా క‌నిపించింది. త‌మ స్నేహితులంద‌రితో క‌లిసి వీరు పోజులిచ్చారు. ఈ నేప‌థ్యంలో జాన్వీ ప్రేమ‌లో ప‌డింద‌ని, అక్ష‌త్ రాజ‌న్ అనే అత‌డికీ, జాన్వీకి మ‌ధ్య‌న ల‌వ్ స్టోరీ న‌డుస్తోంద‌నే టాక్ వినిపిస్తూ ఉంది.