ఆ ఒక్కటి నాగచైతన్య వల్ల అవుతుందా?

సినిమాలో అక్కడక్కడ సరదాగా తెలంగాణ యాస ట్రై చేస్తుంటారు మన హీరోలు. అంతేతప్ప, ఫుల్ లెంగ్త్ లో అదే పాత్ర పోషించడం మాత్రం కష్టం. సినిమా మొత్తం తెలంగాణ యాసలోనే చేయాల్సి వస్తే చాలామంది…

సినిమాలో అక్కడక్కడ సరదాగా తెలంగాణ యాస ట్రై చేస్తుంటారు మన హీరోలు. అంతేతప్ప, ఫుల్ లెంగ్త్ లో అదే పాత్ర పోషించడం మాత్రం కష్టం. సినిమా మొత్తం తెలంగాణ యాసలోనే చేయాల్సి వస్తే చాలామంది హీరోలు డ్రాప్ అయిపోయారు. మొన్నటికి మొన్న ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ తెలంగాణ స్టయిల్ లో డైలాగ్స్ చెబితే విమర్శించిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు నాగచైతన్య కూడా ఈ ఫార్మాట్ ట్రై చేయడానికి రెడీ అవుతున్నాడు.

అవును.. తన అప్ కమింగ్ మూవీలో నాగచైతన్య ఫుల్ లెంగ్త్ లో తెలంగాణ డైలాగ్స్ చెప్పబోతున్నాడు. మొన్నటివరకు చూచాయగా తెలిసిన ఈ విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్థారించాడు. సినిమా మొత్తం చైతూ తెలంగాణ యాసలోనే మాట్లాడతాడని కన్ ఫర్మ్ చేశాడు.

“ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ. నాగచైతన్యకు ఇలాంటి మూవీ అతడి కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్. చైతూ చాలా కష్టపడుతున్నాడు. తెలంగాణ స్లాంగ్ లో సినిమా ఉంటుంది. నాగచైతన్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగులు, అతడి క్యారెక్టర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది.”

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇవాళ్టి నుంచి మొదలైంది. తెలంగాణ పల్లె నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరి మధ్య జరిగే ప్రేమకథ ఇది. సాయిపల్లవికి తెలంగాణ స్లాంగ్ కొత్త కాదు.

ఫిదా సినిమాతో మెప్పించింది. ఎటొచ్చి నాగచైతన్య, తెలంగాణ డైలాగ్స్ ఎలా చెబుతాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 3-4 నెలల్లో టోటల్ సినిమా షూటింగ్ పూర్తిచేయబోతున్నారు. 

నాగచైతన్య, సాయిపల్లవి కొత్త సినిమా ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి