మహేష్ బాబు మూవీలో నటించి తప్పు చేశా

గణేశ్ అనే సాధారణ వ్యక్తి ఓ చిన్న కామెడీ క్యారెక్టర్ చేస్తే ఫర్వాలేదు. కానీ బండ్ల గణేష్ లాంటి వ్యక్తి చిన్న కమెడియన్ పాత్ర పోషించడం మాత్రం తప్పు. ఈ విషయాన్ని స్వయంగా బండ్ల…

గణేశ్ అనే సాధారణ వ్యక్తి ఓ చిన్న కామెడీ క్యారెక్టర్ చేస్తే ఫర్వాలేదు. కానీ బండ్ల గణేష్ లాంటి వ్యక్తి చిన్న కమెడియన్ పాత్ర పోషించడం మాత్రం తప్పు. ఈ విషయాన్ని స్వయంగా బండ్ల గణేశే చెబుతున్నాడు. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో చిన్న కామెడీ రోల్ చేసి తప్పు చేశానంటున్నాడు ఈ నిర్మాత కమ్ నటుడు

“సరిలేరు నీకెవ్వరు పాత్ర చూసి ఇంట్లో నా పిల్లలు నన్ను తిట్టారు. అలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశావ్ నాన్నా అని అడిగింది మా అమ్మాయి. నా పిల్లలు చెప్పింది కరెక్ట్ అనిపించింది. కానీ  అక్కడ నాకు ఇష్టమైన దర్శకుడు ఉన్నాడు. నాకు ఇష్టమైన హీరో మహేష్ ఉన్నాడు. చేయాలనిపించింది, చేసేశాను అంతే. ఇకపై అలాంటి పాత్రలు చేయను.”

సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్టయినా అందులో పోషించిన పాత్ర మాత్రం తనకు తృప్తినివ్వలేదంటున్నాడు బండ్ల. ఇక యాక్టింగ్ చేయనని, నటిస్తే గుండెలు పిండేసే లాంటి పాత్రల్లోనే నటిస్తానని చెబుతున్నాడు.

“సరిలేరు నీకెవ్వరు సినిమా నాకు పెద్దగా తృప్తినివ్వలేదు. ఆ సినిమా ఎందుకు చేశావని చాలామంది నన్ను తిట్టారు. సినిమా పెద్ద హిట్టయింది కానీ నాకు తృప్తినివ్వలేదు. ఇకపై అలాంటి వేషాలు వేయకూడదని నిర్ణయించుకున్నారు. అసలు యాక్టింగే చేయాలని లేదిప్పుడు. ఏదైనా పాత్ర చేస్తే గుండెలు పిండేయాలి. అలాంటి క్యారెక్టర్ చేయాలి. లేదంటే మానేయాలి. నటుడిగా నాకు జీరో తృప్తి.”

తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తానంటున్నాడు బండ్ల గణేశ్. అయితే వాడు హీరోగా నిలదొక్కుకుంటాడా లేక ఆర్టిస్టుగా మాత్రమే మిగిలిపోతాడా అనేది తన చేతిలో లేదంటున్నాడు.