సోషల్ మీడియా పుణ్యమా అని సినీ సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. ఏ విషయాన్నైనా నేరుగా తమ ఫేవరేట్ హీరో, హీరోయిన్ల దృష్టికి తీసుకెళ్లే ఒక మహావకాశం సోషల్ మీడియా కల్పించింది. అయితే ఇది మంచి కోసమైతే ఫర్వాలేదు. కొంత మంది అభిమానులు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అభిమానులు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. దీంతో హీరోయిన్లు షాక్‌కు గురి కావాల్సి వస్తోంది.
తాజాగా ఓ హీరోయిన్‌కు ఎదురైన వింత అనుభవం గురించి చెప్పుకుందాం. బాలీవుడ్ నటి తిలోత్తమ షోమ్కు ఓ అభిమాని మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. అది కూడా చాలా విచిత్రంగా ఉంది. థియేటర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన తిలోత్తమ అభిమాని ప్రపోజల్‌కు బిత్తరపోయారు.
అభిమాని ప్రపోజల్ కథా కమామీషూ గురించి తెలుసుకుందాం.
“మేడం నేను ఇంకా వర్జిన్. మీరు ఒప్పుకుంటే మిమ్మిల్ని పెళ్లి చేసుకుంటాను. మీతో జీవితాన్ని పంచుకోవాలను కుంటున్నాను. నేను వెజిటేరియన్ కూడా. నా గురించి మీరు ఎలా తెలుసుకున్నా ఓకే. బ్రెయిన్ మ్యాపింగ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా లై డిటెక్టర్‌తో కూడా నన్ను పరీక్షించుకోండి. దేనికైనా నేను సిద్ధం” అని సదరు అభిమాని తన పైత్యాన్ని ప్రదర్శించాడు. ఎందుకంటే అతని మొదటి మాట మొదలుకుని ప్రతి అక్షరం వెకిలి చేష్టలను ప్రతిబింబించాయి.
దీనికి హీరోయిన్ తిలోత్తమ షోమ్ స్పందిస్తూ “నో థ్యాంక్స్. బైబై బ్రదర్” అంటూ సమాధానమిచ్చారు. బ్రదర్ అని చెప్పడం ద్వారా సున్నితంగా గుండెల్లో గుచ్చినట్టైంది. అభిమాని పోస్ట్ చేసిన కామెంట్‌ని స్క్రీన్ షాట్ తీసి తిలోత్తమ తన అకౌంట్లో పోస్ట్ చేశారు. అభిమాని ప్రపోజల్, దాన్ని తిరస్కరిస్తూ బ్రదర్ సంబోధనతో తిలోత్తమ ఇచ్చిన కౌంటర్ వెరసి సోషస్ మీడియాలో వైరల్ అయ్యాయి.