విజయ్ దేవరకు లాభమే లాభం

చాలా మంది హీరోల మాదిరిగానే నిర్మాతగా మారాడు విజయ్ దేవరకొండ. కొత్త దర్శకుడితో ఓ ఫన్ సబ్జెక్ట్ ను తీసుకుని, డైరక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' అనే చిన్న సినిమాను…

చాలా మంది హీరోల మాదిరిగానే నిర్మాతగా మారాడు విజయ్ దేవరకొండ. కొత్త దర్శకుడితో ఓ ఫన్ సబ్జెక్ట్ ను తీసుకుని, డైరక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' అనే చిన్న సినిమాను చకచకా నిర్మించేసాడు. ఇప్పుడు ఆ సినిమాను విడుదలకు ముందే అమ్మేసి మంచి లాభం చేసుకున్నాడు.

ఈ సినిమాను నైజాం ఏస్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్, రెండున్నర కోట్లు ఇచ్చి తీసుకున్నారు. సినిమా నిర్మాణానికి ఖర్చు అయింది కూడా అంతే. సునీల్ నారంగ్ టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు తీసుకున్నారు. ఇంక నాన్ థియేటర్ హక్కులు విజయ్ దేవరకొండ దగ్గర వున్నాయి. అవి లాభం అన్నమాట.

ఎలా లేదన్నా శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ కలిపి బాగానే వస్తాయి. అందులో పబ్లిసిటీకి కాస్త పోయినా, మంచి లాభాలే వచ్చే అవకాశం వుంది. వాస్తవానికి మరెవరైనా తీసి వుంటే సునీల్ నారంగ్ ఇలా తీసుకునేవారో లేదో కానీ, విజయ్ దేవరకొండ కాబట్టి, అతనితో ఓ ప్రాజెక్టు కూడా చేసే కార్యక్రమం వుంది కాబట్టి తీసుకున్నారని అనుకోవాలి. చిన్న అమౌంట్ నే కాబట్టి వచ్చేస్తుంది. రాకపోయినా, విజయ్ తో చేసే ప్రాజెక్టు మీద ఇన్ వెస్ట్ మెంట్ అనుకుంటారు.