కేసీఆర్..ఎన్నాళ్లకెన్నాళ్లకూ!

ఒకవైపు చాలా దేశాల్లో మహిళలే సూపర్ పవర్ లుగా చలామణి అవుతున్నారు. భారతదేశం కూడా దశాబ్దాల కిందటే ఒక మహిళను సూపర్ పవర్ గా చేసుకుంది. దశాబ్దాల పాటు  ఆమే దేశానికి పెద్ద దిక్కుగా…

ఒకవైపు చాలా దేశాల్లో మహిళలే సూపర్ పవర్ లుగా చలామణి అవుతున్నారు. భారతదేశం కూడా దశాబ్దాల కిందటే ఒక మహిళను సూపర్ పవర్ గా చేసుకుంది. దశాబ్దాల పాటు  ఆమే దేశానికి పెద్ద దిక్కుగా కొనసాగగలిగారు. పాలిచ్చే  తల్లులు వివిధ దేశాల పార్లమెంట్ లను శాసిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా తన కేబినెట్లో మహిళకు చోటు ఇవ్వడానికి చాలా సమయమే తీసుకున్నారు  తెలంగాణ సీఎం కేసీఆర్.

తన తొలి విడత పాలనలో అసలు మహిళలు ఎవరికీ కేబినెట్లో చోటు ఇవ్వలేదు కేసీఆర్. అలా నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. అయితే రెండోసారి సీఎం అయ్యాకా కూడా కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కలేదు. అయితే తాజా పునర్వ్యస్థీకరణలో మాత్రం వారికి చోటు దక్కింది. ఎట్టకేలకూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలి సారి మహిళలకు చోటు దక్కింది. 

రాష్ట్రం ఏర్పడిన దాదాపు ఆరేళ్లకు తొలిసారి మహిళలకు కేబినెట్లో చోటు లభించింది. ఇంకా నయం కేసీఆర్ ఇప్పటికైనా చోటిచ్చారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పుడు మహిళలు ఇద్దరికి కేబినెట్లో చోటు దక్కగా.. వారిలో ఒకరు  కాంగ్రెస్ తరఫున నెగ్గిన వారు. విలీనం ముద్ర వేయించుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కింది. శాసనమండలి సభ్యురాలైన సత్యవతి రాథోడ్ కు  కేబినెట్లో చోటు లభించింది.