లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో బుల్లితెర, వెండితెర షూటింగ్లు స్టార్ట్ అయ్యాయి. షూటింగ్ల సంగతులు ఎలా ఉన్నా సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కరోనాబారిన పడుతున్నారు. దీంతో ఇండస్ట్రీలో ఆందోళన నెలకుంది.
తాజాగా బిగ్బాస్ రియాల్టీ షో మూడో సీజన్ కంటెస్టెంట్ రవికృష్ణ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. బిగ్బాస్ హౌస్లో మంచి అబ్బాయిగా రవికృష్ణ పేరు పొందాడు.
ఇప్పటికే ప్రభాకర్, హరికృష్ణ, నవ్య స్వామిలకు కరోనాబారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడీ జాబితాలో బిగ్బాస్ రవికృష్ణ చేరిపోయాడు. దీంతో షూటింగ్లు అంటే నటీనటులు హడలిపోతున్నారు.
కాగా పలు సీరియళ్లలో నటిస్తూ రవికృష్ణ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిగ్బాస్ షోతో పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నట్టు రవికృష్ణ పేర్కొన్నాడు. మూడురోజులుగా ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే తనతో పాటు పని చేసిన నటులకు, ఇతర సాంకేతిక సిబ్బందికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించి, ఐసోలేషన్లో ఉంచాలని రవికృష్ణ అభ్యర్థించాడు. ప్రస్తుతం అతను పలు సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉన్నట్టు సమాచారం.