ఆర్.ఆర్.ఆర్. డిజిటల్‌గానా… కామెడీనా?

బాలీవుడ్ మీడియాకి సౌత్ సినిమా డామినేషన్ అసలు నచ్చడం లేదు. బాహుబలి చిత్రానికి అనుకోకుండా పబ్లిసిటీ కల్పించిన బాలీవుడ్ మీడియా ఆ తర్వాత దక్షిణాది చిత్రాలను ఎంత తగ్గించాలో అంత తగ్గించి చూపిస్తోంది. Advertisement…

బాలీవుడ్ మీడియాకి సౌత్ సినిమా డామినేషన్ అసలు నచ్చడం లేదు. బాహుబలి చిత్రానికి అనుకోకుండా పబ్లిసిటీ కల్పించిన బాలీవుడ్ మీడియా ఆ తర్వాత దక్షిణాది చిత్రాలను ఎంత తగ్గించాలో అంత తగ్గించి చూపిస్తోంది.

బాహుబలికి వచ్చిన ప్రమోషన్, ఎలివేషన్ ‘ఆర్.ఆర్.ఆర్.’కి బాలీవుడ్ నుంచి వస్తుందనేది అనుమానమే. కరణ్ జోహార్ లేదా యష్‌రాజ్ సంస్థ వెనుక లేకపోతే అక్కడ మీడియా నుంచి సపోర్ట్ కష్టమే. 

ఇంకా నిర్మాణ దశలోనే వున్న ‘ఆర్.ఆర్.ఆర్.’ని డిజిటల్‌లో రిలీజ్ చేస్తున్నారనే దుష్ర్పచారాన్ని అక్కడి మీడియా మొదలు పెట్టింది.

ఈ సినిమా పూర్తయి, విడుదల కావడానికి కనీసం ఏడాదికి పైగానే పడుతుంది. అప్పటికి సినిమా థియేటర్లు మామూలుగానే రన్ అవుతుంటాయి. అప్పుడు దీనిని ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో విడుదల చేయాల్సిన అవసరం ఏముంది? 

బాలీవుడ్‌లో విడుదలకి సిద్ధంగా వున్న సల్మాన్ ఖాన్ సినిమానే డిజిటల్‌లో విడుదల చేయలేదు. 3, తలైవి చిత్రాలను కూడా థియేటర్స్‌లోనే విడుదల చేస్తామని ఉద్ఘాటించారు. మరి నెక్స్‌ట్ ఇయర్‌కి కానీ రెడీ అవని మన సినిమా ఎందుకు డిజిటల్‌లో వస్తుంది?

ఇవన్నీ పనీ పాటా లేని పుకార్లే తప్ప కాస్త కూడా నిజం లేదని తెలుగు సినిమా ప్రియులందరికీ తెలుసు. ముప్పయ్ కోట్ల సినిమాని ఓటిటిలో విడుదల చేయడానికే ముందుకి రాని తెలుగు సినిమా మూడునాలుగొందల కోట్ల సినిమాని అలా విడుదల చేస్తుందా… కామెడీ కాకపోతే.