చరణ్ తో త్రివిక్రమ్ భేటీ !

టాలీవుడ్ టాప్ లైన్ డైరక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ అలవైకుంఠమపురములో సక్సెస్ తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత పవన్ లేదా రామ్ చరణ్…

టాలీవుడ్ టాప్ లైన్ డైరక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ అలవైకుంఠమపురములో సక్సెస్ తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తరువాత పవన్ లేదా రామ్ చరణ్ తో సినిమా వుంటుందనీ వార్తలు వున్నాయి. అలాగే బన్నీ మళ్లీ రెడీ అనే టాక్ కూడా వుంది.

ఇలాంటి నేపథ్యంలోఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుసగా రెండు మూడు సార్లు హీరో రామ్ చరణ్ ను కలిసారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ లు రెడీ చేయడం అంటే బౌండ్ స్క్రిప్ట్ లు కాదు. అది ఆయన పద్దతి కాదు. 

పాయింట్ బేస్డ్ గా లైన్ అనుకోవడం, కధ అల్లి వుంచుకోవడం, వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అనుకున్నపుడు సీన్లు, సీన్ల ఆర్డర్ రాసుకోవడం త్రివిక్రమ్ స్టయిల్ అని, డైలాగులు మాత్రం ఏ సీన్ కు ఆ సీన్, ఎప్పటికప్పుడే రాస్తారని ఇండస్ట్రీలో వినిపిస్తూ వుంటుంది. అందువల్ల ఎన్టీఆర్ సినిమా తో పాటు చరణ్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ కూడా త్రివిక్రమ్ రెడీ చేసుకున్నట్లు కనిపిస్తోంది.

అందులో భాగంగానే రామ్ చరణ్ తో రెండు మూడు సార్లు భేటీ వేసినట్లు తెలుస్తోంది.

పార్టీని ఏనాడూ పల్లెత్తు మాట కూడా అనలేదు

ఇప్పుడే రాజీనామా చేసేస్తా