సుశాంత్ పై ప్రచారమంతా అభూతకల్పన

సుశాంత్ ఆత్మహత్యపై సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మొత్తాన్ని ట్రాష్ గా కొట్టి పారేశాడు వర్మ. ఎందుకు చనిపోతున్నాడో అతడే చెప్పలేకపోయాడని, అలాంటప్పుడు మరో వ్యక్తి ఎలా చెబుతాడని లాజిక్ పాయింట్ తీశాడు…

సుశాంత్ ఆత్మహత్యపై సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం మొత్తాన్ని ట్రాష్ గా కొట్టి పారేశాడు వర్మ. ఎందుకు చనిపోతున్నాడో అతడే చెప్పలేకపోయాడని, అలాంటప్పుడు మరో వ్యక్తి ఎలా చెబుతాడని లాజిక్ పాయింట్ తీశాడు ఆర్జీవీ.

“తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో అతడే చెప్పలేదు. సూసైడ్ నోట్ లేదు. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫో లేదు. సో.. సోషల్ మీడియాలో జరిగేదంతా ఊహ మాత్రమే. ఇలా అందర్నీ బ్లేమ్ చేయడమనేది కరెక్ట్ కాదు. అతడ్ని 7 సినిమాల నుంచి తీసేశారని ఏదేదో చెబుతున్నారు. ఆ 7 సినిమాలేంటో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మీడియాలో జరుగుతున్నదంతా అభూతకల్పన.”

ఈ సందర్భంగా నెపొటిజంపై కూడా తనదైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. నెపొటిజం అనేది ప్రతి ఇంట్లో ఉంటుందంటున్నాడు వర్మ 

“నెపొటిజం అనేది బాలీవుడ్ లో మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో ఉంటుంది. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, తన ఫ్యామిలీ బాగుపడాలని ప్రతి వ్యక్తి అనుకోవడం నెపొటిజమే. ఈ టాపిక్ పై సినిమా తీయాలని నాకు ఎప్పటికీ అనిపించదు. ఎందుకంటే అది జీవితంలో ఓ భాగం. ఎప్పుడైతే జీవితంలో భాగమైందో అందులో డ్రామా ఉండదు. కాబట్టి నెపొటిజంపై నేను సినిమా తీయను.”

కేవలం మానసిక సమస్యల వల్లనే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని, నెపొజిటానికి అతడి ఆత్మహత్యకు లింక్ ఉంటుందని తను అనుకోవడం లేదంటున్నాడు వర్మ.

ముఠా నాయకుడు బైటకు రావాలి

'వైఎస్సార్‌ కాపు నేస్తం' ప్రారంభం