లాక్ డౌన్ టైమ్ లో ముంబయిలో ఇరుక్కుపోయిన రకుల్.. 3 నెలల పాటు ముంబయిలోని తన ఫ్లాట్ కే పరిమితమైపోయింది. ఎప్పుడైతే విమానాల రాకపోకలు మొదలయ్యాయో అప్పుడు గుర్గావ్ లోని తన ఇంటికి వెళ్లింది. గడిచిన 9 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఇంటికి ఇంతలా దూరమవ్వలేదంటోంది రకుల్.
“ఇంటికొచ్చేశాను, చిన్న పిల్లను అయిపోయాను. ఇక్కడంతా నా ఇష్టం. అలారం పెట్టుకోవాల్సిన పని లేదు. నేను ఎప్పుడు ఇంటికొచ్చినా అమ్మ నాకు నచ్చిన వంట చేస్తుంది. రెండో రోజు కూడా ఉంటే కేక్ చేస్తుంది. ఈసారి ఆ రెండూ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి ఎజెండా లేదు. అమ్మతో టీవీ, నాన్నతో వ్యాయామం ఇదే పని.”
ఇలా తన ఎంజాయ్ మెంట్ ను బయటపెట్టింది రకుల్. ప్రస్తుతం తను చేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయని.. పరిస్థితులు చక్కబడిన తర్వాత హైదరాబాద్ వెళ్తానంటోంది రకుల్. సినిమాలకు కాల్షీట్లు అడ్డుపడకుండా చూసుకోవడమే తనముందున్న లక్ష్యం అంటోంది.
“టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలు మొదలవుతున్నాయి. కొన్ని షూటింగ్స్ కూడా మొదలయ్యాయి. హైదరాబాద్ లో కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత అక్కడికి వెళ్తాను. కొన్ని సౌత్ ప్రాజెక్టులు నేను కంప్లీట్ చేయాల్సి ఉంది. నేను ఒప్పుకున్న హిందీ సినిమా మొదలవ్వకముందే సౌత్ సినిమాలు స్టార్ట్ అయితే బెటర్. లేదంటే నా కాల్షీట్లు క్లాష్ అవుతాయి.”
ప్రజల్లో కరోనా వస్తుందనే భయం ఎక్కువగా ఉందంటోది రకుల్. కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. విమానంలో ప్రయాణించినప్పుడు తను కూడా భయపడ్డానని చెప్పుకొచ్చింది.