జ‌న‌సేన‌- టీడీపీ అభ్య‌ర్ధుల వేద‌న‌!

పవన్, చంద్రబాబు నాయుడు కలయిక అందరికంటే బాగా ఆనందపడుతుంది చంద్రబాబు అనుకూల మీడియా కానీ అందరికంటే ఎక్కువగా బాధపడుతుందేది టీడీపీ, జనసేన లోని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నవాళ్లు. ఇప్పటికే పార్టీ కోసం ఖర్చులు పెట్టుకొని,…

పవన్, చంద్రబాబు నాయుడు కలయిక అందరికంటే బాగా ఆనందపడుతుంది చంద్రబాబు అనుకూల మీడియా కానీ అందరికంటే ఎక్కువగా బాధపడుతుందేది టీడీపీ, జనసేన లోని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నవాళ్లు. ఇప్పటికే పార్టీ కోసం ఖర్చులు పెట్టుకొని, అప్పులు చేసి సీటు వ‌స్తుంద‌ని నమ్మకంతో ఉన్నవాళ్లు అందరూ కూడా ఇప్పుడు భయపడుతున్నట్లు కనపడుతుంది. 

జనసేన- టీడీపీ దాదాపు పొత్తు ఖాయమైనందు వ‌ల్ల కొంత మంది జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు రాత్రికి రాత్రే త‌మ పార్టీ కార్యాలయాలు ఖాళీ చేసిన‌ట్లు వార్తాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి అనంతపురం జనసేన కోసం బాగా కష్టపడిన ఇద్ద‌రు అభ్యర్ధులు ఇప్పుడు నా సీటు కష్టమంటూ పార్టీ అఫీసులు ముసివేసినట్లు వినిపిస్తోంది. ఇన్ని రోజులు పార్టీ కోసం ఖర్చు పెట్టి తీరా మాకు సీటు రాక‌పోతే డ‌బ్బుతో పాటు మ‌ర్యాద కూడా పొతుందాని వాపోతున్నారు. 

ఎందుకంటే జ‌న‌సేన అధినేత‌కు ఇక‌పై త‌న పార్టీ గెలుపుకంటే వైసీపీ ఓటమినే ముఖ్యం అని 2014 ఎన్నిక‌ల మాదిరి త‌న పార్టీ అభ్య‌ర్ధుల‌ను ఎక్క‌డ నిల‌బెట్ట‌కుండా కేవలం టీడీపీ అభ్య‌ర్ధుల కోసం ప్ర‌చారం చేసిన చేయ‌వ‌చ్చాని అందుకే భ‌యంతో కొన్ని చోట్ల జ‌న‌సేన అఫీసులు ముసివేసిన‌ట్లు క‌నిపిస్తోంది. 

కొంత మంది లాబియింగ్ చేసే ఒక‌ సామాజిక వ‌ర్గ నేత‌లు మాత్రం టీడీపీ-జ‌న‌సేన పొత్తు ఉన్న త‌మ‌కు జ‌న‌సేన త‌రుపున కాక‌పోయిన చంద్ర‌బాబు నాయుడు పార్టీ త‌రుపున సీటు సంపాధించుకుంటామ‌ని ధీమా కూడా ఉంది. ఇక‌పై ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో జ‌న‌సేన నేత‌లు, ఉభ‌య గోదావ‌రి జిల్లాలోని టీడీపీ నేత‌లు త‌మ సీటు వ‌స్తుందా లేక పొత్తులో క‌లిపి త‌మ సీటు మాయం అవుతుందా అనే భ‌యంతో రాజ‌కీయం చేస్తారంటూన్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.