గర్జన తరువాత ఏం చేయబోతున్నారు….?

విశాఖ గర్జన విజయవంతమైంది. జోరు వానలో సైతం పెద్ద ఎత్తున జనాలు వచ్చి విశాఖ రాజధానికి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న దాని మీద ఇపుడు అందరి చూపు…

విశాఖ గర్జన విజయవంతమైంది. జోరు వానలో సైతం పెద్ద ఎత్తున జనాలు వచ్చి విశాఖ రాజధానికి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న దాని మీద ఇపుడు అందరి చూపు పడింది. 

నిజానికి విశాఖ గర్జన నిర్వహించడానికి అమరావతి టూ అరసవెల్లి అంటూ రైతులు పాదయాత్రగా ఈ వైపుగా రావడం అన్నదే ప్రధాన కారణం అని అంటున్నారు. ఇపుడు చూస్తే రైతుల పాదయాత్ర విశాఖకు అతి సమీపంలో ఉంది.

ఈ నెల 25 తరువాత విశాఖలో పాదయాత్ర ఎంటర్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు. పాదయాత్రను అడ్డుకోవద్దు అని ఇప్పటికే బాధ్యులైన వారు సూచించారు. కానీ గర్జన తరువాత కాస్తా వేడిగానే పరిస్థితి ఉంది. నాన్ పొలిటికల్ జేఏసీ అయితే మరో విడత రౌండ్ టేబిల్ సమావేశాలను నిర్వహించాలనుకుటోంది.

ఆ తరువాత పంచాయతీల నుంచి విశాఖ కార్పోరేషన్ దాకా అన్ని చోట్లా విశాఖ రాజధానికి అనుకూలంగా తీర్మానాలు చేయించాలని జేఏసీ   కోరుతోంది. వాటితో పాటు విశాఖ వాసుల బలమైన ఆకాంక్షను రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకురావాలని కూడా చూస్తోంది. . విశాఖకు రాజధాని కావాలని కోరుతూ నాన్ పొలిటికల్ జేఏసీ గవర్నర్ కి వినతిపత్రం సమర్పించనుంది అంటున్నారు.

ఈ కార్యక్రమాలు ఇలా ఉంటే విశాఖ వైపుగా వస్తున్న అమరావతి రైతుల పాదయాత్ర నేపధ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతాయో అన్న టెన్షన్ అయితే సర్వత్రా ఉంది. ఇప్పటికే విశాఖ రాజధాని వర్సెస్ అమరావతి గా ఒక పెద్ద డిబేట్ అయితే సాగుతోంది. రాజకీయం కూడా అలాగే విడిపోయింది. దాంతో విశాఖలో పాదయాత్ర సాఫీగా సాగుతుందా అన్నదే చూడాలని అంటున్నారు.