అసలు టైటిల్…’నల్ల వంతెన’

గతంలో భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర, లాంటి వైవిధ్యమైన సినిమాలు నిర్మించిన సంస్థ 70 ఎమ్ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్. లేటెస్ట్ గా “శ్రీదేవి సోడా సెంటర్” తో ప్రేక్షకుల ముందుకు…

గతంలో భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర, లాంటి వైవిధ్యమైన సినిమాలు నిర్మించిన సంస్థ 70 ఎమ్ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్. లేటెస్ట్ గా “శ్రీదేవి సోడా సెంటర్” తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. పలాస 1978 దర్శకుడు కరుణ కుమార్ రూపొందించిన ఈ సినిమా ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సందర్భంగా నిర్మాతలు విలేకర్లతో మాట్లాడారు.

చిల్లా విజయ్ మాట్లాడుతూ మేము ఈ సినిమా షూట్ మొదలు పెట్టిన రోజే మెయిన్ కెమెరా కింద పడిపోయింది. మరుసటి రోజు షూటింగ్ అయిపోయి వెళ్లేటప్పుడు కేరవాన్ అసిస్టెంట్ కి కరెంట్ షాక్ కొట్టింది. ఆ తర్వాత రోజు మళ్ళీ షూట్ చేస్తుంటే కేరవాన్ గొయ్యి లో ఇరుక్కుపోయింది. ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. అందరూ కూడా బ్యాడ్ టైం లో స్టార్ట్ చేసావు అన్నారు. 

మేము సెంటిమెంట్స్ ను ఎక్కువగా నమ్మము అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా సినిమా షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాం. ఆ తర్వాత మా దురదృష్టం ఏంటంటే మా బ్రదర్ చనిపోయాడు ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. నా జీవితంలో ఇంతకంటే నష్టం మరొకటి ఉండదు .ఆ తర్వాత మేము వన్ మంత్ షూట్ బ్రేక్ తీసుకొని మళ్లీ స్టార్ట్ చేశాం. 

మరో నిర్మాత శశి మాట్లాడుతూ మేము మొదట ఈ సినిమాకు “నల్ల వంతెన” అని టైటిల్ అనుకున్నాము.. కానీ మేము చేసే లవ్ స్టోరీ కి ఈ టైటిల్ క్యాచీగా లేదని సెకండ్ ఆప్షన్ గా ” శ్రీదేవి సోడా సెంటర్” టైటిల్ ను ఫిక్స్ చేశాము. మేజర్ ఈవెంట్ అన్నీ కూడా ఈషాప్ దగ్గరే జరుగుతుంటాయి. ఆ షాప్ చుట్టూ జరిగే స్టోరీ కాబట్టి “శ్రీదేవి సోడా సెంటర్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. 

మేము మంచి కథలు వచ్చినప్పుడే సినిమాలు చేస్తాం. ఈ సినిమాలోని క్యారెక్టర్స్ అబ్బాయి, అమ్మాయి, వారి తల్లిదండ్రులు లాంటి వారు చాలా మంది కనిపిస్తారు. ఈ సినిమా రా..గా ఉండదు ఈ సినిమాలో రియల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇలాంటి రూరల్ ఫిలిం కి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలను కున్నప్పుడు నాకు మణిశర్మ గారి గుర్తొచ్చారు. అద్భుతమైన సంగీతం ఇచ్చారు. 

సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్‌టైన్మెంట్స్ లక్ష్మణ్ గారి సపోర్ట్ తో ఆంధ్ర, తెలంగాణ లలో సుమారు 500 థియేటర్స్ లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. ఇవి కాక ఇంకా అమెరికా లో 120 థియేటర్స్ లో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. ప్రతి ఫ్యామిలీ ఈసినిమా ను చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం అన్నారు నిర్మాతలు శశి, విజయ్.