కరోనా రెండో దశ నుంచి తెలుగు రాష్ట్రాలు కోలుకున్న నేపథ్యంలో సినిమాల విడుదల ఊపు అందుకుంది. తొలిగా విడుదలైన సంగతి పక్కన పెడితే ఆగస్ట్ మూడో వారం నుంచి విడుదల కాబోతున్న సినిమాలు అన్నీ అటు హీరోలకో, ఇటు దర్శకులకో లిట్మస్ టెస్ట్ కాబోతున్నాయి.
శ్రీదేవి సోడా సెంటర్. సుధీర్ బాబు-ఆనందని కాంబినేషన్ లో వస్తోందీ సినిమా. సుధీర్ బాబు ఈ సినిమా కోసం మేకోవర్ సాధించారు. కష్టపడ్డారు, ఆ సంగతి అలా వుంచితే పలాస సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కరుణ కుమార్ రెండో సినిమా. ఇది కూడా హిట్ కొడితే ఓ మెట్టు పైకి ఎక్కి దర్శకుడిగా స్థిరపడిపోతాడు. అలాగే దిల్ రాజు నుంచి భాగస్వామిగా విడివడిన లక్ష్మణ్ ఈ సినిమాను టోటల్ గా కొనుగోలు చేసారు. టక్ జగదీష్ ను కొనుగోలు చేసినా, అది ఓటిటికి వెళ్లిపోయింది. అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం మీద ఆయన కొనుగోలు చేసిన సినిమా ఇది. సో..ఆయనకు కూడా విజయం అవసరం.
ఇచ్చట వాహనములు నిలుపరాదు. అక్కినేని మనవడు సుశాంత్ సినిమా ఇది. చి.ల.సౌ సినిమాతో కాస్త కళ వచ్చింది. అల వైకుంఠపురములో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి ఆ హిట్ లో తనకు కొంత వాటా వుందనిపించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కనుక హిట్ అయితే హీరోగా మరింత ముందుకు వెళ్లడానికి అవకాశం వుంటుంది.
సీటీమార్.. మాంచి మాస్ డైరక్టర్ గా ప్రూవ్ చేసకున్నాడు కానీ దర్శకుడు సంపత్ నంది ఇంకా ముందుకు వెళ్లాల్సి వుంది. సీటీమార్ కనుక హిట్ అయితే నిచ్చెన ఎక్కేస్తాడు. ఇక హీరో గోపీచంద్ కు పరీక్షే. ప్లాపుల దారిలో వెళ్తున్నాడు. హిట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సీటీమార్ హిట్ అయితే ఆ ఊపే వేరుగా వుంటుంది.
లవ్ స్టోరీ. చైతన్య-సాయిపల్లవి-శేఖర్ కమ్ముల క్రేజీ కాంబినేషన్. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ఫైనాన్షియర్ సునీల్ నారంగ్. ఇది హిట్ అయితే ఇక ధైర్యంగా ముందుకు సాగిపోతాడు. చైతన్య హిట్ లీగ్ లోనే వున్నాడు కాబట్టి అతనికి సమస్య కాదు. సాయిపల్లవి-శేఖర్ కమ్ముల కాంబినేషన్ మరోసారి ప్రూవ్ చేసుకోవాలి. అలా అని అదేమీ టెస్ట్ కాదు. జస్ట్ బూస్ట్. అంతే.
ఇక థియేటర్ లోకి రాకపోయినా, టక్ జగదీష్, మాస్ట్రో సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
హీరో నానికి టక్ జగదీష్ హిట్ చాలా అవసరం. వి సినిమా చాలా డిస్సపాయింట్ చేసింది. అందువల్ల ఈ సినిమా హిట్ కొట్టితీరాలి. లేకుంటే యంగ్ హీరోల కాంపిటీషన్ తట్టుకోవడం కష్టం. అలాగే శివనిర్వాణ తరువాత సినిమాకు క్రేజీ హీరో దొరకాలన్నా ఈ సినిమా హిట్ కావాల్సిందే.
నితిన్ హీరోగా మాస్ట్రో సినిమా వస్తోంది. అంథాదూన్ రీమేక్ ఇది. నితిన్ కు కూడా హిట్ కాస్త అవసరమే. రంగ్ దే ఆశించిన రేంజ్ కు చేరలేదు. అందువల్ల ఈ సినిమా హిట్ కావాల్సిందే. అలాగే దర్శకుడు మేర్లపాక గాంధీకి కూడా. రెండు హిట్ లు, ఓప్లాపు, ఓ బుల్లి సినిమా అన్నట్లు వుంది గ్రాఫ్. అందువల్ల ఈ సినిమా తో మరోసారి ప్రూవ్ చేసుకుంటే మరో మంచి సినిమా చేతిలో పడే అవకాశం వుంది.