హీరోలు అందరిలో బన్నీ రూటే వేరు. పక్కా ఐకానిక్ గా వుండాలనుకుంటాడు ఐకాన్ స్టార్ కదా? అందరూ వెళ్లే దారిలో వెళ్లమన్నా వెళ్లడు.
నిన్నటికి నిన్న మెగాస్టార్ తో చుట్టరికం వున్న వారంతా ఆయన ఇంటికి క్యూ కట్టారు. ఆయనకు పుట్టిన రోజు విసెష్ చెప్పడానికి వెళ్లారు. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్లు, బావలు, తోడల్లుళ్లు, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులు ఇలా.
కానీ అక్కడ కనిపించనిది ఒక్క బన్నీ మాత్రమే. అల్లు అరవింద్, భార్య వెళ్లారు. కానీ మేనత్త భర్త అయిన మామయ్య మెగాస్టార్ ను గ్రీట్ చేయడానికి మాత్రం బన్నీ వెళ్లలేదు. ఆఫ్ కోర్స్ ట్విట్టర్ లో ట్వీటు వేసారనుకోండి.
బన్నీ ఎప్పుడూ ఇంతే మిగతావాళ్లంతా తన గురించే మాట్లాడుకునేలా చేయడంలో స్పెషలిస్ట్ అనుకోవాలి. వెళ్లి వుంటే ఈ వార్తే లేదు కదా?
ఉప్పెన టైమ్ లో కూడా అంతే మిగిలిన మెగా ఫ్యామిలీ అంతా ఆ సినిమాను ముందుగా మెచ్చుకున్నా, తరువాత..ఎప్పుడో…బన్నీ తన వంతు తెచ్చుకున్నారు. అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకునేలా చేసారు.