మునుగోడు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు హద్దులు దాటుతున్నట్లు కనపడుతోంది. టీఆర్ఎస్- బీజేపీ మధ్య అధిపత్య పోరు కాస్తా కేటీఆర్-కోమటిరెడ్డి బ్రదర్స్ గా మారింది. కేటీఆర్ ఒక విమర్శ చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ అదే రీతిలో సమాధానం చెప్తున్నారు.
ఇవాళ మంత్రి కేటీఆర్ తన కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఉద్దేశిస్తూ కోమటిరెడ్డి బదర్స్ ను కోవర్ట్ రెడ్డి బదర్స్ గా అభివర్ణించాడంతో కోమటిరెడ్డి వెంకట రెడ్డి కేసీఆర్ కుటుంబంపై అదే రీతిలో సమాధానం చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం అని అభివర్ణించారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి మీడియాతో మట్లాడుతూ 'మీ అవినీతి చిట్టా మొత్తం నా దగ్గర ఉందని, నా జోలికి వస్తే మీ మొత్తం చిట్టా బయట పెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ ఒళ్లు దగ్గరు పెట్టుకుని మాట్లాడాలి. తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేము కోవర్టులమా?, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావ్? కేటీఆర్' అంటూ ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్న నీ చెల్లెలు కవితను కాపాడుకోవాలని హితవు చెప్పారు. ఓడిపోతాము అనే భయంతోనే కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.