ఆ మధ్య నిండు గర్భవతిగా పెళ్లి పీటలెక్కింది నేహా దూపియా. ఆమె కన్నా మునుపు పిల్లల తల్లిగా కూడా పీటలెక్కిన హీరోయిన్లు ఉన్నారు. కమల్ హాసన్ – సారికా, పవన్ కల్యాణ్ – రేణూ దేశాయ్.. పిల్లలు పుట్టాకా పెళ్లి చేసుకున్న జంటలు!
ఇక ఈ మధ్యకాలంలోకి వస్తే.. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాకా పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్నారు రణ్ బీర్ కపూర్ – అలియా భట్. వీరి వివాహం అయిన వెంటనే వీరు పేరెంట్స్ కాబోతున్న విషయాన్ని ప్రకటించి, ఎన్నో నెలో చెప్పి ఆశ్చర్యపరిచారు. వారు చెప్పిన లెక్కల ప్రకారమే.. వీరి పెళ్లి తేదీ నుంచి కూడారు నెటిజన్లు. వారెన్ని లెక్కలేసినా.. వీరి పెళ్లికి పూర్వమే అలియా భట్ ప్రెగ్నెంట్ అని తేల్చారు ఈ జనాలు.
ఇక నయనతార- విఘ్నేష్ శివన్లు ఇంకా ఫాస్టు. వీరు కూడా నెలల వ్యవధిలోనే తల్లిదండ్రులు అయ్యారు. అది కూడా నయనతార ఎక్కడా కడుపుతో కనిపించలేదు. వివిధ సినిమాల షూటింగుల్లోనే బిజీగా ఉంది పెళ్లైన దగ్గర నుంచి. ముందు రోజు కూడా గాడ్ ఫాదర్ గురించి ప్రెస్ నోట్ ఇచ్చింది. ఆ తర్వాతి రోజు తల్లైన విషయాన్ని ప్రకటించారు. గర్భాన్ని ప్రకటించకుండా, గర్భవతిగా కనిపించకుండా.. తల్లి కావడం గురించి ప్రకటించారు. అదేమంటో సరోగసి!
సినిమా వాళ్ల కు లైఫ్ ఇలా చాలా ఈజీ అవుతోంది. ఇది పూర్తిగా వారి వ్యక్తిగతం, వారి ఇష్ట ప్రకారమే. ఆ స్వేచ్ఛ వారికి ఉండనే ఉంది. రాజ్యాంగం, సమాజం కూడా ఇప్పుడు వీటిని అభ్యంతర పెట్టే పరిస్థితుల్లో లేదు. ఎటొచ్చీ.. ఇంకా ప్రేమించుకున్నారని పిల్లలను చంపేవాళ్లు, కులాంతర వివాహం అంటూ యువదంపతులను దారుణ హత్యలు చేసే వారు.. ఇలాంటి విషయాలను కాస్త గమనించాలి. ప్రపంచం చాలా మారుతోంది, పెళ్లి, ప్రెగ్నెన్సీ, కాపురం.. ఇవన్నీ వ్యక్తిగత ఇష్టాలని.. కాస్తైనా లిబరల్ గా మారితే మంచిదేమో!