సితార ఎంటర్ టైన్ మెంట్స్ సీరియస్ గా ప్లాన్ చేస్తున్న సినిమా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్. కోటి రూపాయలు పెట్టి హక్కుల కొన్న ఈ సినిమాను మాంచి మల్టీ స్టారర్ గా చేయాలని ప్రయత్నం. మొదటి నుంచీ బాలకృష్ణ-రానా కాంబినేషన్ అనే అనుకున్నారు. కానీ పాటలు, ఫైట్లు, హీరోయిన్లు లేకుండా కేవలం ఎమోషన్ల మీద నడిచే ఈ కథ పట్ల బాలయ్య పెద్దగా ఆసక్తి పెట్టినట్లు కనిపించడం లేదు. పైగా బాలయ్య నేరుగా డీల్ చేయడం కన్నా, ఆయనకు నిర్మాతకు మధ్యలో చాలా వుంటాయి. ఇవన్నీ కలిసి మొత్తం మీద అయ్యప్పన్ రీమేక్ కు బాలయ్యను దూరం చేసినట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు రెండు ఆప్షన్లను నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి విక్టరీ వెంకటేష్-రానా కాంబినేషన్. ఇప్పటి వరకు తెరమీదకు రాని కాంబినేషన్ ఇది. సినిమా స్టార్ట్ అవుతూనే ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుంది. రెండవ ఆప్షన్ రవితేజ-రానా కాంబినేషన్. ఇది కూడా క్రేజీగానే వుంటుంది.
హరీష్ శంకర్?
అయితే స్టార్ కాస్ట్ మాత్రమే ఆలోచన కాదు, డైరక్టర్ ఎవరు అన్నది కూడా. సరైన డైరక్టర్ పేరు యాడ్ అయితే కానీ ప్రాజెక్టుకు సరైన జోష్ రాదు. కాస్త పేరున్న, కెపాసిటీ వున్న డైరక్టర్లు ఎవ్వరూ ఖాళీ లేరు. పవన్ సినిమాలు బాగా ఆలస్యం అయ్యేలా వున్నాయి. అందువల్ల హరీష్ శంకర్ కనుక చేస్తే బాగుంటుందనే ఆలోచన నిర్మాతల్లో వున్నట్లు బోగట్టా. లేదా ఇంకా ఈ మిడిల్ రేంజ్ డైరక్టర్లు ఎవరు వున్నారు అన్నది కూడా డిస్కషన్ లో వున్నట్లు తెలుస్తోంది.